News November 28, 2024

చంద్రబాబు పాలనలో జరిగిందిదే: జగన్

image

AP: చంద్రబాబు గత పాలనలో దిక్కుమాలిన రేట్లకు విద్యుత్ ఒప్పందాలు చేసుకున్నారని జగన్ ఆరోపించారు. విండ్ విద్యుత్‌కు సంబంధించి యూనిట్ రూ.4.84, సోలార్‌కు రూ.6.49కు ఒప్పందం చేసుకున్నారని మండిపడ్డారు. బాబు హయాంలో సోలార్ యావరేజ్ రూ.5.90 అయితే, తాము రూ.2.49కి సెకీతో ఒప్పందం చేసుకోవడంపైనా తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఫైరయ్యారు. చంద్రబాబు పాలనలో PPAల వల్ల రాష్ట్రానికి ఏటా రూ.1500 కోట్ల నష్టం వస్తుందన్నారు.

Similar News

News November 29, 2024

కానిస్టేబుల్ అభ్యర్థులకు శుభవార్త

image

APలో కానిస్టేబుల్ అభ్యర్థులకు పోలీస్ నియామక మండలి శుభవార్త చెప్పింది. ఫిజికల్ టెస్టులకు సంబంధించి స్టేజ్-2 కోసం దరఖాస్తుల స్వీకరణ గడువును డిసెంబర్ 6వ తేదీ వరకు పొడిగించింది. గతంలో విధించిన గడువు ఇవాళ్టితో ముగిసిన నేపథ్యంలో మళ్లీ పొడిగించింది. DEC చివరి వారంలో PMT, PET టెస్టులు జరగనున్నాయి. అభ్యర్థులకు సందేహాలుంటే 9441450639, 9100203323 నంబర్లను సంప్రదించండి. దరఖాస్తు చేసేందుకు ఇక్కడ <>క్లిక్<<>> చేయండి.

News November 28, 2024

ఫలితాలు విడుదల

image

TG: పాలిటెక్నిక్ లెక్చరర్ ఉద్యోగాలకు ఎంపికైన వారి జాబితాను TGPSC విడుదల చేసింది. ఈసీఈ, ఈఐఈ, అర్కిటెక్చర్ ఇంజినీరింగ్, కెమిస్ట్రీ, ఫిజిక్స్, లెక్చరర్ ఇన్ లెటర్ ప్రెస్ వంటి పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను వెబ్‌సైటులో పొందుపరిచింది. ఫలితాల కోసం ఇక్కడ <>క్లిక్ <<>>చేయండి.

News November 28, 2024

మహారాష్ట్రలో పదవుల పంపకం.. ఆరుగురు ఎమ్మెల్యేల‌కు ఒక మంత్రి ప‌ద‌వి

image

మంత్రి పదవుల విషయంలో మహాయుతిలోని 3 పార్టీలు ఏకాభిప్రాయానికి వచ్చాయి. ఆరుగురు MLAల‌కు ఒక మంత్రి ప‌ద‌వి చొప్పునా పంచుకోవాల‌ని నిర్ణ‌యించిన‌ట్టు తెలుస్తోంది. ఈ లెక్క‌న 132 స్థానాల్లో గెలిచిన BJPకి 21-22 ప‌ద‌వులు, 57 స్థానాల్లో గెలిచిన శిండే వ‌ర్గానికి ఒక డిప్యూటీ CM స‌హా 10-12 ప‌ద‌వులు, 41 సీట్లు గెలిచిన అజిత్ ప‌వార్ వ‌ర్గానికి ఒక డిప్యూటీ సీఎం స‌హా 8-9 మంత్రి ప‌ద‌వులు ద‌క్క‌నున్నాయ‌ని తెలుస్తోంది.