News November 28, 2024
RTC బస్సులు ఎక్కే వారికి శుభవార్త

AP: విజయవాడ నుంచి విశాఖ, హైదరాబాద్, బెంగళూరు మధ్య తిరిగే డాల్ఫిన్, అమరావతి బస్సుల్లో రాయితీ అందిస్తున్నట్లు APSRTC ప్రకటించింది. చలికాలం కావడంతో AC బస్సులకు డిమాండ్ తగ్గడంతో ఈ ఆఫర్ అందుబాటులోకి తెచ్చింది. డిసెంబర్ 1 నుంచి 31వ తేదీ వరకు ఆదివారం మినహా మిగతా రోజుల్లో బెంగళూరు వెళ్లే బస్సుల్లో 20శాతం, విజయవాడ నుంచి విశాఖ, హైదరాబాద్ మధ్య నడిచే బస్సుల్లో 10శాతం రాయితీ ఇస్తున్నట్లు తెలిపింది.
Similar News
News January 16, 2026
9 నెలల్లో భారత్ ఎగుమతులు 634 బిలియన్ డాలర్లు

భారత్ 2025-26 ఆర్థిక సంవత్సరంలో 9 నెలల్లో 4.33% వృద్ధితో 634 బిలియన్ డాలర్ల ఎగుమతులను నమోదు చేసింది. వాణిజ్య శాఖ ప్రాథమిక డేటా ప్రకారం ఏప్రిల్ నుంచి డిసెంబర్ మధ్య వస్తువుల ఎగుమతులు 330 బిలియన్ డాలర్లకు చేరాయి. ఇందులో ప్రధానంగా తృణధాన్యాలు, ఎలక్ట్రానిక్స్, జీడిపప్పు, మాంసం, పాల ఉత్పత్తులు ఉన్నాయి. ఇవన్నీ ఎక్కువగా అమెరికా, చైనా, UAE, స్పెయిన్, హాంకాంగ్ వంటి దేశాలకు ఎగుమతి అవుతున్నాయి.
News January 16, 2026
శ్రీవారి దర్శనానికి 18 గంటల సమయం

AP: సంక్రాంతి పండుగ సందర్భంగా తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. టోకెన్లు లేనివారికి సర్వదర్శనానికి 18 గంటల వరకు టైమ్ పడుతోంది. కంపార్టుమెంట్లన్నీ నిండిపోయి శిలా తోరణం వరకు క్యూ లైన్ ఉంది. గురువారం వేంకటేశ్వరుడిని 64,064 మంది దర్శించుకోగా 30,663 మంది తలనీలాలు సమర్పించారు. హుండీ ద్వారా రూ.3.80కోట్లు ఆదాయం వచ్చిందని TTD ప్రకటించింది.
News January 16, 2026
ఇరాన్ వీధుల్లో అద్దె సైనికులు

ఇరాన్‌లో కొనసాగుతున్న నిరసనలను అణిచివేయడానికి ఖమేనీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దేశీయ భద్రతా బలగాలపై నమ్మకం తగ్గడంతో ఇరాక్ నుంచి కిరాయికి యువకులను రప్పించినట్లు అంతర్జాతీయ మీడియా వెల్లడించింది. యాత్రికుల ముసుగులో వీరంతా ఇరాన్‌లోకి చొరబడుతున్నారని, అనంతరం నిరసనకారులపై హింసకు పాల్పడుతున్నారని ఆరోపణలు వస్తున్నాయి. హెజ్బొల్లా గ్రూప్ వంటి వారు ఇందులో ఉన్నట్లు సమాచారం.


