News November 28, 2024
అప్పుడు అభిమానిగా.. ఇప్పుడు తోటి ఆటగాడిగా..
నితీశ్ కుమార్ రెడ్డి కోహ్లీకి వీరాభిమాని. 2018లో BCCI అవార్డులకు హాజరైన నితీశ్ విరాట్‌తో సెల్ఫీకి చాలా ట్రై చేశారు. కుదరలేదు. దూరం నుంచే విరాట్, తాను ఒకే ఫ్రేమ్‌లో ఉండేలా సెల్ఫీ తీసుకుని సంతోషపడ్డారు. కట్ చేస్తే.. 2024లో విరాట్ 81వ సెంచరీ సెలబ్రేషన్లో తానూ భాగమయ్యారు. సెంచరీ పూర్తవగానే తన హీరోని హగ్ చేసుకున్నారు. ఆ ఫొటోలు వైరల్ అవుతున్నాయి. ఇది కదా సక్సెస్ అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.
Similar News
News November 29, 2024
PIC OF THE DAY: ప్రధానితో క్రికెటర్లు
ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్‌తో టీమ్ ఇండియా క్రికెటర్లు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కాన్‌బెర్రా పార్లమెంట్ వద్ద ప్రధానితో భారత ఆటగాళ్లు గ్రూప్ ఫొటో తీసుకున్నారు. ఇందుకు సంబంధించిన పిక్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కాగా ఎల్లుండి నుంచి ప్రైమ్ మినిస్టర్ XIతో భారత్ వార్మప్ మ్యాచ్ ఆడనుంది. డిసెంబర్ 6 నుంచి అడిలైడ్‌లో రెండో టెస్టు జరగనుంది.
News November 29, 2024
కానిస్టేబుల్ అభ్యర్థులకు శుభవార్త
APలో కానిస్టేబుల్ అభ్యర్థులకు పోలీస్ నియామక మండలి శుభవార్త చెప్పింది. ఫిజికల్ టెస్టులకు సంబంధించి స్టేజ్-2 కోసం దరఖాస్తుల స్వీకరణ గడువును డిసెంబర్ 6వ తేదీ వరకు పొడిగించింది. గతంలో విధించిన గడువు ఇవాళ్టితో ముగిసిన నేపథ్యంలో మళ్లీ పొడిగించింది. DEC చివరి వారంలో PMT, PET టెస్టులు జరగనున్నాయి. అభ్యర్థులకు సందేహాలుంటే 9441450639, 9100203323 నంబర్లను సంప్రదించండి. దరఖాస్తు చేసేందుకు ఇక్కడ <
News November 28, 2024
ఫలితాలు విడుదల
TG: పాలిటెక్నిక్ లెక్చరర్ ఉద్యోగాలకు ఎంపికైన వారి జాబితాను TGPSC విడుదల చేసింది. ఈసీఈ, ఈఐఈ, అర్కిటెక్చర్ ఇంజినీరింగ్, కెమిస్ట్రీ, ఫిజిక్స్, లెక్చరర్ ఇన్ లెటర్ ప్రెస్ వంటి పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను వెబ్‌సైటులో పొందుపరిచింది. ఫలితాల కోసం ఇక్కడ <