News November 28, 2024
డిసెంబర్ 4న క్యాబినెట్ భేటీ

AP క్యాబినెట్ సమావేశం డిసెంబర్ 4వ తేదీన జరగనుంది. వెలగపూడి సచివాలయంలోని మొదటి బ్లాక్‌లో సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఉదయం 11 గంటలకు జరగనుంది. రాష్ట్రంలో తాజా పరిస్థితులు, ఇసుక పాలసీ, కొత్త పథకాలు, రేషన్‌కార్డులు, అమరావతి రాజధాని మాస్టర్ ప్లాన్ సహా పలు అంశాలపై క్యాబినెట్ సమావేశంలో చర్చించనున్నారు.
Similar News
News October 28, 2025
రోజూ ఇలా చేస్తే ప్రశాంతంగా నిద్ర పడుతుంది: వైద్యులు

నిద్ర నాణ్యతను మెరుగుపరుచుకోవడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలను వైద్యులు సూచిస్తున్నారు. ‘రోజూ నిద్రపోయే సమయాన్ని ఫిక్స్ చేసుకోండి. వారాంతాల్లోనూ ఒకే సమయానికి పడుకుని, మేల్కొంటే శరీరం ఒకే దినచర్యకు అలవాటు పడుతుంది. పడుకునే 30-60 నిమిషాల ముందు టీవీలు, ల్యాప్‌టాప్స్‌కు దూరంగా ఉండాలి. దీనికి బదులు పుస్తకాలు చదవండి. గదిని చల్లగా, చీకటిగా, నిశ్శబ్దంగా ఉండేలా చూసుకోండి’ అని చెబుతున్నారు.
News October 28, 2025
ప్లాస్టిక్ మల్చింగ్ వల్ల లాభమేంటి?

కలుపు నివారణలో మల్చింగ్ కీలక పాత్ర పోషిస్తుంది. ప్లాస్టిక్ షీటును మొక్క చుట్టూ నేలపై కప్పడాన్ని ప్లాస్టిక్ మల్చింగ్ అంటారు. ప్లాస్టిక్ మల్చింగ్ వల్ల నేల తేమను నిలుపుకుంటుంది. కలుపు కట్టడి జరుగుతుంది. పంట ఏపుగా పెరిగి దిగుబడి బాగుంటుంది. కూరగాయల సాగుకు ఇది అనుకూలం. మల్చింగ్ చేసిన ప్రాంతంలో పంటకాలం పూర్తయ్యాక దున్నాల్సిన అవసరం లేకుండా పాత మొక్కలను తీసేసి వాటి స్థానంలో కొత్త మొక్కలను నాటుకోవచ్చు.
News October 28, 2025
BREAKING: మచిలీపట్నానికి 160km దూరంలో ‘మొంథా’

AP: ‘మొంథా’ తుఫాను తీరంవైపు దూసుకొస్తోంది. గడిచిన 6 గంటల్లో గంటకు 12 కి.మీ వేగంతో కదిలినట్లు APSDMA తెలిపింది. ప్రస్తుతానికి మచిలీపట్నానికి 160KM, కాకినాడకు 240KM, విశాఖపట్నానికి 320KM దూరంలో కేంద్రీకృతమైనట్లు వివరించింది. తుఫాను ప్రభావాన్ని విపత్తుల నిర్వహణ సంస్థ కంట్రోల్ రూమ్ నుంచి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోందని వివరించింది. ప్రజలు ఇంట్లోనే సురక్షితంగా ఉండాలని సూచించింది.


