News November 28, 2024
గండికోట నాకు స్పెషల్: కేంద్ర మంత్రి పెమ్మసాని

AP: గండికోట ప్రాజెక్ట్ తనకు ఎంతో ప్రత్యేకమని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. తమ పూర్వీకులే ఈ కోటను పాలించారని ఆయన చెప్పారు. ‘గండికోట అభివృద్ధికి రూ.78 కోట్ల నిధులు విడుదల చేస్తున్నాం. ఈ నిధులతో ఇక్కడ అవసరమైన మౌలిక వసతులు కల్పిస్తాం. గ్రాండ్ కాన్యన్ ఆఫ్ ఇండియాగా దీనిని తీర్చిదిద్దుతాం’ ఆయన వ్యాఖ్యానించారు.
Similar News
News January 29, 2026
మహారాష్ట్ర డిప్యూటీ సీఎంగా సునేత్రా పవార్?

దివంగత అజిత్ పవార్ స్థానంలో ఆయన భార్య సునేత్రా పవార్‌ను మహారాష్ట్ర Dy.CMగా ప్రతిపాదించాలని NCP యోచిస్తోంది. పార్టీ సీనియర్ నేతలు ఇప్పటికే ఆమెతో చర్చలు జరిపారు. అజిత్ మరణంతో ఖాళీ అయిన బారామతి నుంచి ఆమె పోటీ చేసే అవకాశం ఉంది. పార్టీ అధ్యక్షుడిగా ప్రఫుల్ పటేల్ బాధ్యతలు తీసుకోనున్నట్లు సమాచారం. ఈ వ్యవహారాలు పూర్తైన తర్వాతే శరద్ పవార్ నేతృత్వంలోని NCP(SP)లో విలీనంపై చర్చలు జరగొచ్చని తెలుస్తోంది.
News January 29, 2026
కల్తీకి కేరాఫ్ అడ్రస్ జగన్: మంత్రి సవిత

AP: తిరుమల వేంకన్న ఆస్తులు కొట్టేయాలన్న కుట్రతో పవిత్రమైన లడ్డూ ప్రసాదాన్ని జగన్ కల్తీ చేయించారని మంత్రి సవిత మండిపడ్డారు. పామాయిల్, ఇతర కెమికల్స్‌తో లడ్డూ కల్తీ జరిగిందని, నెయ్యి లేదని సిట్ స్పష్టం చేసిందన్నారు. జంతుకొవ్వు లేదు కదా అని చేసిన తప్పు కప్పిపుచ్చుకోడానికి YCP బ్యాచ్ బుకాయిస్తోందని ఫైరయ్యారు. కల్తీకి కేరాఫ్ అడ్రస్ జగన్ అని, కల్తీ విషయంలో చట్టం తన పని తాను చేసుకుపోతుందని పేర్కొన్నారు.
News January 29, 2026
మేడిగడ్డ బ్యారేజీకి కేంద్రం రెడ్ అలర్ట్

TG: కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీ తీవ్ర ముప్పులో ఉందని కేంద్రం తేల్చింది. ఈ మేరకు దాన్ని అత్యంత ప్రమాదకరమైన కేటగిరీ-1లో చేర్చింది. ఈ విషయాన్ని కేంద్ర జల్ శక్తి శాఖ లోక్‌సభకు తెలిపింది. లోపాలను తక్షణమే సరిచేసి బ్యారేజీని పటిష్టం చేయాలని NDSA సిఫార్సు చేసిందని పేర్కొంది. మన్నిక పెరిగేలా చర్యలు చేపట్టాలని రాష్ట్రానికి సూచించింది. ఖజూరి (UP), బొకారో (ఝార్ఖండ్) ఇదే కేటగిరీలో ఉన్నాయి.


