News November 28, 2024
పంచాయతీ ఎన్నికలపై ప్రభుత్వం కసరత్తు!
తెలంగాణలో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం పూర్తిస్థాయిలో కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. జనవరి 14న నోటిఫికేషన్ విడుదల చేసి 3 విడతల్లో ఎన్నికలు నిర్వహించాలని భావిస్తోంది. ఫిబ్రవరి రెండో వారంలో ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. అటు ఈ సారి ఎన్నికల్లో ముగ్గురు పిల్లలుంటే పోటీకి అనర్హులనే నిబంధనను ఎత్తివేయనుంది. అలాగే రిజర్వేషన్లలో మార్పులు, చేర్పులపై ప్రణాళికలు రచిస్తోంది.
Similar News
News November 29, 2024
ఏపీ కలెక్టర్ల సమావేశం వాయిదా
AP: డిసెంబర్ 4న క్యాబినెట్ సమావేశం నేపథ్యంలో కలెక్టర్ల కాన్ఫరెన్స్ వాయిదా పడింది. మరోవైపు కేబినెట్‌లో చర్చించే ప్రతిపాదనలు 2లోగా పంపాలని వివిధ శాఖలను సీఎస్ నీరభ్ కుమార్ ప్రసాద్ ఆదేశించారు. కాగా కలెక్టర్ సమావేశం DEC 9, 10న నిర్వహించే అవకాశముంది.
News November 29, 2024
ఈరోజు నమాజ్ వేళలు
తేది: నవంబర్ 29, శుక్రవారం
ఫజర్: తెల్లవారుజామున 5:12 గంటలకు
సూర్యోదయం: ఉదయం 6:29 గంటలకు
దుహర్: మధ్యాహ్నం 12:04 గంటలకు
అసర్: సాయంత్రం 4:04 గంటలకు
మఘ్రిబ్: సాయంత్రం 5:40 గంటలకు
ఇష: రాత్రి 6.56 గంటలకు
నోట్: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.
News November 29, 2024
సెంట్రల్ యూనివర్సిటీల్లో 5 వేల ఖాళీలు
కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో 5 వేల టీచింగ్ పోస్టులు ఖాళీగా ఉన్నట్టు కేంద్ర విద్యాశాఖ తెలిపింది. ఉద్యోగ విరమణ, రాజీనామాలు, అదనపు అవసరాల వల్ల ఈ ఖాళీలు ఏర్పడ్డాయని, అయితే ఖాళీల భర్తీ బాధ్యత ఆయా వర్సిటీలదే అని పేర్కొంది. ఎప్పటికప్పుడు ఉద్యోగాల భర్తీకి UGC 2023లో CU-Chayan Portalను ప్రవేశపెట్టిందన్నారు. విద్యార్హతల ఆధారంగా ఈ పోర్టల్‌లో ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి. Share It.