News November 28, 2024
తుంగభద్ర తీరంలో మొసలి కలకలం
తుంగభద్ర నది తీరంలో మొసలి కలకలం లేపింది. కౌతాళం మండలం గుడి కంబాలి సమీపంలో గురువారం తుంగభద్ర నది ఒడ్డున పెద్ద మొసలి పొలాల వైపు రావడంతో రైతులు భయాందోళనకు గురయ్యారు. ఈ ఏడాదిలో తుంగభద్ర నది తీరంలోని అనేక గ్రామాల పంట పొలాలలో మొసళ్లు కంటబడుతున్నాయి. నది చాగీ, కుమ్మలనూరు, మురళి గ్రామాల సమీపంలో 2 నెలల నుంచి మొసళ్లు సంచరిస్తూనే ఉన్నాయని, అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరారు.
Similar News
News November 29, 2024
సీసీ రోడ్ల నిర్మాణ పనులు వేగవంతం చేయండి: కలెక్టర్
జిల్లాలో ప్రారంభించిన సీసీ రోడ్ల నిర్మాణ పనుల పూర్తికి 4 వారాలు మాత్రమే సమయం ఉందని, నాణ్యత ప్రమాణాలు పాటించి మండలాల వారీగా కేటాయించిన లక్ష్యాన్ని పూర్తి చేయాలని కలెక్టర్ రాజకుమారి పంచాయతీరాజ్ ఇంజినీర్లను ఆదేశించారు. నంద్యాల కలెక్టరేట్లో ఆమె మాట్లాడారు. 1,026 సీసీ రోడ్ల నిర్మాణానికి గాను 255 రోడ్లు పూర్తి అయ్యాయని, మిగిలిన 771 సీసీ రోడ్ల లక్ష్యాన్ని పూర్తి చేయాలని ఆదేశించారు.
News November 28, 2024
ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల్లో వంద శాతం ఉత్తీర్ణత సాధించాలి: కలెక్టర్
ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల్లో వంద శాతం ఉత్తీర్ణత సాధించే విధంగా చర్యలు తీసుకోవాలని కర్నూలు జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా ప్రభుత్వ, ఎయిడెడ్ ఇంటర్మీడియట్ కళాశాలల ప్రిన్సిపల్‌లను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్‌లో ఇంటర్మీడియట్ విద్యార్థుల ఉత్తీర్ణతా శాతం పెంపు పై ప్రభుత్వ, ఎయిడెడ్ ఇంటర్మీడియట్ కళాశాలల ప్రిన్సిపల్ లతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు.
News November 28, 2024
తిరుమల తరహాలో శ్రీశైల క్షేత్రం అభివృద్ధి: కలెక్టర్
తిరుమల తరహాలో శ్రీశైల క్షేత్రాన్ని అభివృద్ధి చేసేందుకు సమగ్ర వివరాలతో మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసేందుకు నివేదికలు ఇవ్వాలని కలెక్టర్ రాజకుమారి సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం నంద్యాల కలెక్టర్ ఛాంబర్‌లో శ్రీశైల మహాక్షేత్ర అభివృద్ధిపై జేసీ సీ.విష్ణు చరణ్‌తో కలిసి సమీక్ష నిర్వహించారు. రెవెన్యూ అధికారి రాము నాయక్, తదితర అధికారులు ఉన్నారు.