News November 28, 2024
కాంగ్రెస్ అతివిశ్వాసమే కొంపముంచింది: ఉద్ధవ్ వర్గం
మహారాష్ట్ర ఎన్నికల్లో ఓటమి తరువాత విపక్ష MVAలో లుకలుకలు ప్రారంభమయ్యాయి. లోక్‌సభ ఎన్నికల తరువాత కాంగ్రెస్‌లో ఏర్పడిన అతి విశ్వాసమే MVA కొంపముంచిందని శివసేన ఉద్ధవ్ వర్గం బహిరంగ విమర్శలకు దిగింది. ఎన్నికల ముందే కాంగ్రెస్ నేతలు మంత్రిత్వ శాఖలు పంచుకొనేందుకు కోట్‌లు, టైలు సిద్ధం చేసుకున్నారని మండిపడింది. ఉద్ధవ్‌ను సీఎంగా ప్రకటించివుంటే ఫలితాలు మరోలా ఉండేవని వాదిస్తోంది.
Similar News
News November 29, 2024
విరాట్ సరసన నిలిచేది ఎవరో?
BGTలో భారత జట్టు డిసెంబర్ 6 నుంచి ఆస్ట్రేలియాతో రెండో టెస్టు ఆడనుంది. డే అండ్ నైట్ మ్యాచ్ కావడంతో దీనిపై అందరిలో ఆసక్తి నెలకొంది. ఇప్పటివరకు టీమ్ ఇండియా నాలుగు డై అండ్ నైట్ టెస్టులు ఆడగా కేవలం కోహ్లీ మాత్రమే సెంచరీ సాధించారు. 2019లో బంగ్లాతో జరిగిన మ్యాచులో ఆయన 136 పరుగులు చేశారు. ఈ క్రమంలో BGT రెండో టెస్టులో ఏ భారత ఆటగాడు సెంచరీ చేసి కోహ్లీ సరసన నిలుస్తారని భావిస్తున్నారో కామెంట్ చేయండి?
News November 29, 2024
అమిత్ షా నివాసంలో మహాయుతి నేతల భేటీ
మహారాష్ట్ర ముఖ్యమంత్రి విషయంలో ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. తాజాగా కేంద్ర మంత్రి అమిత్ షా ఇంట్లో మహాయుతి నేతలు దేవేంద్ర ఫడణవీస్, ఏక్‌నాథ్ శిండే, అజిత్ పవార్ సమావేశమయ్యారు. ఈ భేటీకి మరో కేంద్రమంత్రి జేపీ నడ్డా హాజరయ్యారు. దాదాపు అర్ధగంటకు పైగా సమావేశం జరిగినట్లు తెలుస్తోంది. ఇవాళ సీఎం అభ్యర్థి ఎవరనే విషయమై క్లారిటీ వచ్చే అవకాశముంది.
News November 29, 2024
నవంబర్ 29: చరిత్రలో ఈ రోజు
1759: ప్రముఖ గణిత శాస్త్రవేత్త నికోలస్ బెర్నోలీ మరణం
1877: తొలిసారిగా థామస్ ఆల్వా ఎడిసన్ ఫోనోగ్రాఫ్ ప్రదర్శన
1901: ప్రముఖ చిత్రకారుడు, పద్మశ్రీ గ్రహీత శోభా సింగ్ జననం
1982: నటి రమ్య జననం
1993: పారిశ్రామికవేత్త జె.ఆర్.డి.టాటా మరణం(ఫొటోలో)