News November 29, 2024
16 ఏళ్లలోపు పిల్లలకు ఇవి నిషేధం.. చట్టాన్ని ఆమోదించిన ఆస్ట్రేలియా
16 ఏళ్లలోపు పిల్లలు సోషల్ మీడియా వినియోగాన్ని నిషేధిస్తూ తెచ్చిన చట్టాన్ని ఆస్ట్రేలియా గురువారం ఆమోదించింది. అన్ని టెక్ దిగ్గజాలను దీని పరిధిలోకి తెచ్చింది. ఇన్‌స్టాగ్రామ్, మెటా, టిక్‌టాక్ వంటి సంస్థలు ఇక నుంచి మైనర్ల లాగిన్‌ను నిలిపివేయాలి. లేదంటే రూ.410 కోట్ల జరిమానా ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ చట్టాన్ని జనవరిలో పైలెట్ ప్రాజెక్టుగా అమలు చేసి ఏడాది కాలంలో పూర్తిస్థాయిలో అమలు చేస్తారు.
Similar News
News November 29, 2024
రూ.1.44 లక్షల కోట్ల టోల్ ఫీజు వసూలు: నితిన్ గడ్కరీ
జాతీయ రహదారులపై ఏర్పాటు చేసిన టోల్ ప్లాజాల ద్వారా 2000 డిసెంబర్ నుంచి ఇప్పటివరకూ రూ.1.44 లక్షల కోట్ల టోల్ ఫీజు వసూలైనట్లు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. LSలో అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. ప్రస్తుతం ఎలాంటి అడ్డంకులు లేకుండా ఫాస్టాగ్‌తో పాటు ఎలక్ట్రానిక్ టోల్ కనెక్షన్ సిస్టమ్ అమలు చేస్తున్నట్లు చెప్పారు. ఇంకా గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ ఆధారిత టోల్ విధానం అమల్లోకి రాలేదన్నారు.
News November 29, 2024
శీతాకాలంలో కొందరికే చలి ఎక్కువ.. ఎందుకంటే?
కొందరు ఉన్న చలి కంటే ఎక్కువ చలిని అనుభవిస్తారు. విటమిన్లు, పోషకాల లోపం వల్ల కొందరి శరీరం వేడిని నిర్వహించే సామర్థ్యం తగ్గుతుంది. అందుకే వారు చలిని ఎక్కువగా ఫీల్ అవుతారు. ఐరన్ లోపం ఉన్న వారి రక్తంలో ఆక్సిజన్ ప్రవాహం తగ్గడంతో ఎక్కువ చలి అనుభవిస్తారు. అలాగే కాళ్లు, చేతుల్లో తక్కువ రక్త ప్రవాహం ఉండేవారికీ చలి ఎక్కువగా పుడుతుంది. సరైన ఆహారం తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు.
News November 29, 2024
ముంబైలో మరోసారి భేటీ: ఏక్‌నాథ్ శిండే
కేంద్ర మంత్రి అమిత్ షా నివాసంలో చర్చలు సానుకూలంగా జరిగినట్లు మహారాష్ట్ర అపద్ధర్మ సీఎం ఏక్‌నాథ్ శిండే తెలిపారు. ఎన్నికల్లో విజయం తర్వాత షా, నడ్డాతో ఇదే తొలి సమావేశమని చెప్పారు. మరో సమావేశం ముంబైలో ఉంటుందని తెలిపారు. ఇందులో సీఎం ఎవరనే విషయమై నిర్ణయానికి వస్తారని పేర్కొన్నారు. షాతో భేటీ తర్వాత మహాయుతి నేతలు తిరిగి ముంబైకి పయనమయ్యారు.