News November 29, 2024

సెంట్ర‌ల్ యూనివ‌ర్సిటీల్లో 5 వేల ఖాళీలు

image

కేంద్రీయ విశ్వవిద్యాల‌యాల్లో 5 వేల టీచింగ్ పోస్టులు ఖాళీగా ఉన్న‌ట్టు కేంద్ర విద్యాశాఖ తెలిపింది. ఉద్యోగ విర‌మ‌ణ‌, రాజీనామాలు, అద‌న‌పు అవ‌స‌రాల వ‌ల్ల ఈ ఖాళీలు ఏర్ప‌డ్డాయ‌ని, అయితే ఖాళీల భ‌ర్తీ బాధ్య‌త ఆయా వ‌ర్సిటీల‌దే అని పేర్కొంది. ఎప్ప‌టిక‌ప్పుడు ఉద్యోగాల భ‌ర్తీకి UGC 2023లో CU-Chayan Portalను ప్ర‌వేశ‌పెట్టింద‌న్నారు. విద్యార్హతల ఆధారంగా ఈ పోర్టల్‌లో ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి. Share It.

Similar News

News November 29, 2024

3 గంటలకు పైగా రన్ టైమ్ ఉన్న చిత్రాలివే..

image

అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కిన ‘పుష్ప-2’ రన్ టైమ్ 3 గంటలకుపైనే అని తెలుస్తోంది. తెలుగులో అత్యధిక రన్ టైమ్ కలిగిన చిత్రంగా దానవీరశూరకర్ణ(3.46 గం.) ఉంది. ఆ తర్వాత లవకుశ(3.28 గం.), పాండవ వనవాసం(3.18గం.), పాతాళ భైరవి(3.15గం.) వంటి చిత్రాలు నిడివి ఎక్కువగా ఉండి అప్పట్లో సంచలనాలు సృష్టించాయి. ఈ మధ్యకాలంలో వచ్చిన అర్జున్ రెడ్డి, RRR వంటి సినిమాల రన్ టైమ్ 3 గంటలకు‌పైనే కావడం గమనార్హం.

News November 29, 2024

మరోసారి జీవన్ రెడ్డికే అవకాశం!

image

TG: కరీంనగర్-నిజామాబాద్-మెదక్-ఆదిలాబాద్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మరోసారి జీవన్ రెడ్డికే అవకాశం ఇవ్వనున్నారు. ఈ మేరకు గాంధీభవన్‌లో టీపీసీసీ తీర్మానం చేసింది. ప్రభుత్వంపై ప్రజల్లో సానుకూలత ఉన్న నేపథ్యంలో కాంగ్రెస్ అభ్యర్థి విజయం ఖాయమని భావించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. పట్టభద్రుల స్థానాన్ని నిలుపుకోవాలని నేతలకు టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ సూచించారు.

News November 29, 2024

ధరణి సమస్యల పరిష్కార బాధ్యత వారిదే..

image

TG: ధరణి పోర్టల్‌లో సమస్యల పరిష్కారానికి బాధ్యత అడిషనల్ కలెక్టర్, ఆర్డీవోలదేనని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అప్లికేషన్ల పరిష్కారానికి తహశీల్దార్‌కు 7 రోజులు, ఆర్డీవోకు 3 రోజులు, అదనపు కలెక్టర్‌కు 3 రోజులు, కలెక్టర్‌కు 7 రోజుల గడువు ఇచ్చింది. పెండింగ్ సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులకు సూచించింది.