News November 29, 2024
రూ.1.44 లక్షల కోట్ల టోల్ ఫీజు వసూలు: నితిన్ గడ్కరీ
జాతీయ రహదారులపై ఏర్పాటు చేసిన టోల్ ప్లాజాల ద్వారా 2000 డిసెంబర్ నుంచి ఇప్పటివరకూ రూ.1.44 లక్షల కోట్ల టోల్ ఫీజు వసూలైనట్లు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. LSలో అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. ప్రస్తుతం ఎలాంటి అడ్డంకులు లేకుండా ఫాస్టాగ్‌తో పాటు ఎలక్ట్రానిక్ టోల్ కనెక్షన్ సిస్టమ్ అమలు చేస్తున్నట్లు చెప్పారు. ఇంకా గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ ఆధారిత టోల్ విధానం అమల్లోకి రాలేదన్నారు.
Similar News
News November 29, 2024
శ్రీవారి దర్శనానికి 13 గంటల టైమ్
AP: తిరుమలలో భక్తుల రద్దీ స్వల్పంగా పెరిగింది. ప్రస్తుతం 25 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 13 గంటల సమయం పడుతోంది. నిన్న వేంకటేశ్వరుడిని 56,952 మంది దర్శించుకున్నారు. 21,714 మంది తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం రూ.3.84 కోట్లు లభించింది.
News November 29, 2024
ధర్మాన మాజీ పీఏ మురళి అరెస్ట్
AP: మాజీ మంత్రి ధర్మాన కృష్ణదాస్ మాజీ పీఏ, వైద్యారోగ్య శాఖ ఉద్యోగి మురళిని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. ఆదాయానికి మించిన ఆస్తులున్నాయనే ఆరోపణలతో నిన్నటి నుంచి మురళి, అతని బంధువుల ఇళ్లలో సోదాలు నిర్వహించారు. 20 ఎకరాల భూమి, విశాఖ, శ్రీకాకుళం సహా పలు ప్రాంతాల్లో ప్లాట్లు, కిలో బంగారం, 11.36 కిలోల వెండి ఆభరణాలు, వస్తువులను గుర్తించారు. వీటి విలువ దాదాపు రూ.50 కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు.
News November 29, 2024
బోలెడంత టాలెంట్.. ఏం లాభం?
Talent is nothing without discipline అనేది పృథ్వీషాకు చక్కగా వర్తిస్తుంది. మరో సచిన్ అని పేరు తెచ్చుకున్న ఇతడు చివరకు IPL వేలంలో అన్ సోల్డ్ గా మిగిలారు. గర్ల్‌ఫ్రెండ్స్‌తో లేట్ నైట్ పార్టీలు, గొడవలు, ఫిట్‌నెస్ సమస్యలతో చిన్న వయసులోనే వివాదాల్లో చిక్కుకున్నారు. టాలెంటెడ్ క్రికెటర్ అయిన పృథ్వీకి 19 ఏళ్లకే దేశం తరఫున ఆడే అవకాశం వచ్చింది. కానీ దాన్ని సద్వినియోగం చేసుకోవడంలో విఫలమయ్యారు.