News November 29, 2024

జిల్లాకు మరిన్ని పరిశ్రమలు తీసుకురావడమే లక్ష్యం: టీజీ భరత్

image

జిల్లాకు మరిన్ని పరిశ్రమలు తీసుకురావడమే తమ ప్రభుత్వ లక్ష్యమని జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి టీజీ భరత్ పేర్కొన్నారు. గురువారం అనంతపురం కలెక్టరేట్లోని రెవెన్యూ భవనంలో జిల్లా అభివృద్ధి సమీక్ష కమిటీ సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. 1,000 హెక్టార్ల భూమి ఉంటే పరిశ్రమలు ఏర్పాటు చేయవచ్చని తెలిపారు.

Similar News

News February 28, 2026

కార్డుదారుడు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు: జేసీ

image

అనంతపురం జిల్లాలోని 6,74,333 రైస్ కార్డుదారులకు సరిపడా నిత్యావసర సరుకులు చౌక ధరల దుకాణాలకు కేటాయించినట్లు జాయింట్ కలెక్టర్ విష్ణు చరణ్ తెలిపారు. ప్రతి నెల 1 నుంచి 15వ తేదీ వరకు ఉదయం & సాయంత్రం వేళల్లో రేషన్ షాపుల వద్దనే నిత్యావసర సరుకులు పంపిణీ చేయాలని డీలర్లకు ఆయన సూచించారు. కార్డుదారులు తమకు దగ్గరలో ఉన్న ఏ చౌక ధరల దుకాణం వద్దనైనా నిత్యావసర సరుకులను పోర్టబిలిటీ ద్వారా పొందవచ్చన్నారు.

News February 28, 2026

పింఛన్ పంపిణీలో కలెక్టర్ ఆనంద్

image

అనంతపురం రూరల్ మండలం ఉప్పరపల్లిలో ‘ఎన్టీఆర్ భరోసా’ పథకం కింద పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఆనంద్ పాల్గొన్నారు. లబ్ధిదారుల ఇళ్ల వద్దకు వెళ్లి కలెక్టర్ స్వయంగా నగదు అందజేశారు. గ్రామస్థులు తమ సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లగా.. వాటిని వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యమని కలెక్టర్ స్పష్టం చేశారు.

News February 28, 2026

అనంత: వైద్యశాఖపై జిల్లా కలెక్టర్ సమీక్ష

image

అనంతపురం కలెక్టరేట్ రెవెన్యూ భవనంలో జిల్లా కలెక్టర్ ఆనంద్ శుక్రవారం సమీక్ష నిర్వహించారు. జిల్లా ICDS, మెడికల్ అండ్ హెల్త్ శాఖల పనితీరుపై చర్చించారు. ICDS PD, DMHO, CDPOలు, సూపర్‌వైజర్లు, వైద్యాధికారులు హాజరయ్యారు. గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు అందుతున్న సేవలను మెరుగుపరచాలని సూచించారు. పోషణ, టీకాలు, ఆరోగ్య శిబిరాల నిర్వహణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు.