News November 29, 2024

SSC: 64 వేల మంది మీడియం మార్చుకున్నారు!

image

AP: టెన్త్ పబ్లిక్ పరీక్షలను <<14665980>>తెలుగు మీడియంలో<<>> రాసేందుకు విద్యాశాఖ అవకాశం కల్పించిన సంగతి తెలిసిందే. దీంతో 64,600 మంది తాము తెలుగులో పరీక్షలు రాస్తామని మీడియంను మార్చుకున్నారు. 5 లక్షల మందికి పైగా విద్యార్థులు ఇంగ్లిష్‌లోనే ఎగ్జామ్స్ రాయనున్నారు. కొందరు ఉర్దూ, కన్నడ లాంటి ఇతర భాషలనూ ఎంపిక చేసుకున్నారు. ఇప్పటివరకు మొత్తం 6,42,635 మంది వార్షిక పరీక్షల కోసం ఫీజులు చెల్లించారు.

Similar News

News November 29, 2024

గుండెపోటుతో పదేళ్ల బాలిక మృతి

image

TG: గుండెపోటుతో పదేళ్ల బాలిక మృతిచెందిన ఘటన మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలో చోటుచేసుకుంది. రోటిగూడ గ్రామానికి చెందిన నాగరాజు, అనూష దంపతులకు ఒక కూతురు, కొడుకు ఉన్నారు. నాలుగో తరగతి చదువుతున్న కూతురు సమన్విత(10) గురువారం ఉదయం ఛాతీ నొప్పితో కుప్పకూలింది. తల్లిదండ్రులు వెంటనే ఆస్పత్రికి తరలించగా అప్పటికే బాలిక గుండెపోటుతో చనిపోయినట్లు డాక్టర్లు నిర్ధారించారు.

News November 29, 2024

ఇదే బౌలింగ్ అటాక్ కొనసాగించండి: పుజారా

image

BGTలో ఆడిలైడ్ పింక్ బాల్ టెస్ట్‌కు సిద్ధమవుతోన్న టీమ్‌ఇండియాకు క్రికెటర్ పుజారా సలహా ఇచ్చారు. తొలి టెస్ట్‌లో సక్సెస్ అయిన బౌలింగ్ అటాక్‌నే కొనసాగించాలన్నారు. బుమ్రా, సిరాజ్, హర్షిత్ రాణాలనే మరోసారి ఎంపిక చేయాలని సూచించారు. బుమ్రా ప్రణాళికలను అమలు చేస్తూ వారిద్దరూ వికెట్లు సాధిస్తున్నట్లు చెప్పారు. అటు, KL రాహుల్‌ను టాప్ ఆర్డర్‌లో ఆడించాలని, ఓపెనర్‌గా లేదా వన్‌డౌన్‌‌లో పంపితే బాగుంటుందన్నారు.

News November 29, 2024

500 కేజీల డ్రగ్స్ పట్టివేత

image

అరేబియా సముద్రంలో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. భారత నేవీ 500 కేజీల మాదకద్రవ్యాలను పట్టుకుంది. ఫిషింగ్ బోట్లలో డ్రగ్స్ తరలిస్తుండగా స్వాధీనం చేసుకున్నారు. శ్రీలంక నేవీతో కలిసి భారత నౌకాదళం ఈ ఆపరేషన్ చేపట్టింది.