News November 29, 2024

బాపట్ల కోర్టుకు వర్రా రవీంద్ర తరలింపు

image

అసభ్యకర పోస్టుల కేసులో కడప జైలుకు వెళ్లిన వర్రా రవీంద్రరెడ్డిపై ఉమ్మడి గుంటూరు జిల్లా పెదనందిపాడులో మరో కేసు నమోదైంది. ఈ దర్యాప్తులో భాగంగా రవీంద్రను PT వారెంట్‌పై కడప జైలు నుంచి బాపట్ల పోలీసులు బయటకు తీసుకు వచ్చారు. ఇవాళ ఆయనను బాపట్ల జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో హాజరుపరిచనున్నట్లు సమాచారం.

Similar News

News November 3, 2025

ప్రపంచ కప్‌లో కడప అమ్మాయికి 14 వికెట్లు

image

భారత్ ప్రపంచ కప్ గెలవడంలో కడప జిల్లాకు చెందిన శ్రీచరణి(21) కీలక పాత్ర పోషించారు. ఎలాంటి అంచనాలు లేకుండా ఆమె జట్టులోకి అడుగు పెట్టారు. లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్‌గా ఇప్పటి వరకు ఆమె 22 వికెట్ల పడగొట్టారు. వరల్డ్ కప్‌లోని 9 మ్యాచుల్లోనే 14 వికెట్లు తీయడం విశేషం. ఓ బాల్ స్పిన్, మరో బాల్ నేరుగా వేసి బ్యాటర్లను తికమకపెట్టారు. సెమీస్‌లో ఆస్ట్రేలియా స్కోర్ మరింత పెరగకుండా చివరి ఓవర్లు కట్టుదిట్టంగా వేశారు.

News November 3, 2025

పెన్షన్ కోసం మూడేళ్లుగా ఎదురుచూపులు

image

భర్త మరణించి మూడేళ్లు గడిచినా పెన్షన్ కోసం ఇంకా ఎదురుచూస్తున్నట్లు గోపవరం(M) సండ్రపల్లికి చెందిన చెన్నమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం ఆమె మాట్లాడుతూ.. పెన్షన్ కోసం దరఖాస్తు చేసినా సచివాలయ అధికారుల నుంచి సరైన స్పందన లేదని వాపోయారు. అధికారులు కరుణించి, వితంతు పెన్షన్ మంజూరు చేయాలని వేడుకుంటున్నట్లు ఆమె కనీటి పర్యంతమయ్యారు. దీనిపై అధికారులు స్పందించాల్సి ఉంది.

News November 2, 2025

వరల్డ్ కప్.. వికెట్ పడగొట్టిన శ్రీచరణి

image

మహిళల ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్‌ హోరాహోరీగా సాగుతోంది. ఇందులో భాగంగా కడప జిల్లా యర్రగుంట్లకు చెందిన టీం ఇండియా బౌలర్ శ్రీచరణి వికెట్ పడగొట్టింది. సౌతాఫ్రికా 62 పరుగుల వద్ద ఉండగా ఆమె బ్యాటర్ బాష్(Bosch)ను రెండో వికెట్‌గా పెవిలియన్‌కు పంపింది.