News November 29, 2024
భారీగా పడిపోయిన ఉష్ణోగ్రతలు.. వణికిస్తున్న చలి

APలో ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోయాయి. ముఖ్యంగా మన్యంలో చలి పంజా విసురుతోంది. గత ఏడాది NOV 10-30 తేదీల్లో 13-13.5 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవగా, ఈసారి మరో 5డిగ్రీలు తగ్గిపోయాయి. నిన్న డుంబ్రిగూడలో 8.6, జి.మాడుగుల, జీకే వీధిలో 8.7, హుకుంపేటలో 8.8, అరకులోయలో 9.1డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వృద్ధులు, గర్భిణులు జాగ్రత్తగా ఉండాలని, ఉదయం, సాయంత్రం బయటికెళ్లొద్దని అధికారులు సూచిస్తున్నారు.
Similar News
News October 23, 2025
స్థానిక ఎన్నికలే అజెండా.. మరికొన్ని గంటల్లో క్యాబినెట్ భేటీ

TG: స్థానిక సంస్థల ఎన్నికలే ప్రధాన అజెండాగా ఈరోజు 3PMకు క్యాబినెట్ భేటీ కానుంది. నిలిచిపోయిన ఎన్నికలపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. బీసీలకు 42% రిజర్వేషన్లపై కోర్టులు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులపై ఎలా ముందుకు వెళ్లాలో సీఎం, మంత్రులు చర్చించనున్నారు. ఎన్నికల్లో పోటీకి ఇద్దరు పిల్లల నిబంధనను ఎత్తివేసే చట్ట సవరణ ఆర్డినెన్స్ ప్రతిపాదన మంత్రివర్గం ముందుకు రానుంది.
News October 23, 2025
DMRCలో ఉద్యోగాలు

ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్(DMRC)18 పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల అభ్యర్థులు ఈనెల 31వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి బీటెక్, బీఈ, డిప్లొమా, ఇంటర్, టెన్త్, సీఏ, ICWA ఉత్తీర్ణులై ఉండాలి. వయసు 18 నుంచి 40ఏళ్ల మధ్య ఉండాలి. వెబ్‌సైట్: https://delhimetrorail.com/
News October 23, 2025
మన వాళ్లను ఇక్కడికి రప్పిద్దాం.. కేంద్రం ఆలోచన

అమెరికా సహా విదేశాల్లో స్థిరపడిన భారత సంతతి పరిశోధకులు, నిపుణులు, ఫ్యాకల్టీని స్వదేశానికి రప్పించాలని కేంద్రం భావిస్తోంది. వారు ఇక్కడి విద్యాసంస్థల్లో బోధించేలా, రీసెర్చ్‌లు చేసేలా ప్రోత్సహించేందుకు చర్యలు తీసుకుంటోంది. IIT వంటి ఉన్నత విద్యా సంస్థల్లో వారికి ఉద్యోగాలిచ్చేలా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. ఉన్నత విద్యపై ట్రంప్ అనుసరిస్తున్న విధానాల నేపథ్యంలో ఈ దిశగా అడుగులేస్తోంది.