News November 29, 2024

OTP డెలివరీల్లో ఆలస్యం ఉండదు: ట్రాయ్

image

నెట్ బ్యాంకింగ్, ఆధార్ OTPల డెలివరీల్లో December 1 నుంచి ఆలస్యం కానున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని TRAI ఖండించింది. OTPలు ఎప్పటిలాగే సత్వరమే అందుతాయని తెలిపింది. ఫేక్ కాల్స్, ఫ్రాడ్ మెసేజ్‌లను అరికట్టేందుకు మెసేజ్ ట్రేస్‌బిటిలీ వ్యవస్థను తీసుకొచ్చామని, దీని ప్రభావం OTP డెలివరీలపై పడదని పేర్కొంది. సైబర్ మోసాలను అడ్డుకునేందుకు OTPలను సమీక్షించాలని టెలికం సంస్థలను TRAI ఆదేశించిన సంగతి తెలిసిందే.

Similar News

News November 29, 2024

హైదరాబాద్‌లో ‘పుష్ప-2’ ప్రీరిలీజ్ వేడుక?

image

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప-2’ సినిమా మేకర్స్ ప్రమోషన్స్‌లో జోరును పెంచారు. ఇప్పటికే చెన్నై, కేరళలో ఈవెంట్స్ నిర్వహించగా ఇప్పుడు హైదరాబాద్‌లో గ్రాండ్ ఈవెంట్ ఏర్పాటు చేసేందుకు సిద్ధమయ్యారు. మల్లారెడ్డి కాలేజీలో డిసెంబర్ 1న ప్రీరిలీజ్ వేడుకను నిర్వహించేందుకు పోలీసులు అనుమతి ఇచ్చినట్లు సినీవర్గాలు పేర్కొన్నాయి. సుకుమార్‌తో సహా చిత్ర బృందం పాల్గొంటుందని వెల్లడించాయి.

News November 29, 2024

లోక్‌సభలో కీలక బిల్లు ప్రవేశపెట్టనున్న అమిత్ షా

image

కేంద్ర హోంమంత్రి అమిత్‌షా నేడు విపత్తు నిర్వహణ సవరణ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెడతారు. ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ఏయే అధికారులకు ఎలాంటి బాధ్యతలు అప్పగించాలి, ఎవరినెక్కడ మోహరించాలి, బాధితుల భద్రత, పునరావాసం, కేంద్ర రాష్ట్రాల బాధ్యతల్లో విభజన వంటివి ఇందులో నిర్వచిస్తారు. మరోవైపు రాజ్యసభలో ఇంట్రడక్షన్‌కు 44, ఆమోదం కోసం 5 బిల్లులను ప్రవేశపెడతారు.

News November 29, 2024

ఇలాంటి చట్టాన్ని మన దగ్గరా తీసుకొస్తే?

image

సోషల్ మీడియాపై నియంత్రణ లేకపోవడంతో సెన్సిటివ్, అసభ్యకర పోస్టులనూ పిల్లలు చూసేస్తున్నారు. దీంతో వారి మానసిక స్థితి పూర్తిగా మారిపోతోంది. ఈక్రమంలో <<14737992>>ఆస్ట్రేలియా<<>> ప్రభుత్వం 16ఏళ్ల లోపు పిల్లలు సోషల్ మీడియా వినియోగించొద్దని చట్టం తీసుకొచ్చింది. ఇండియాలోనూ ఇలాంటి చట్టం తీసుకురావాలని డిమాండ్ ఏర్పడింది. మొబైల్స్, సోషల్ మీడియా వల్ల పిల్లలు చదవట్లేదని, చెడు ఆలోచనలు వస్తున్నాయని నెట్టింట చర్చ జరుగుతోంది.