News November 29, 2024
చలికాలంలో పెరుగు తినొచ్చా?

చలికాలంలో వేడి పదార్థాలు తినేందుకు మక్కువ చూపిస్తాం. పెరుగు, మజ్జిగ తీసుకుంటే కఫం వస్తుందని భావించి కొందరు దూరం పెడుతుంటారు. అయితే పెరుగు తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. పెరుగులో పోషకాలు ఎక్కువగా ఉంటాయని జీర్ణాశయ ఆరోగ్యానికి, ఎముకల దృఢత్వానికి తోడ్పడుతుందని అంటున్నారు. ఈ సమయంలో శరీరానికి పెరుగు ఎంతో అవసరమని, రోజుకు రెండు పూటలా తినొచ్చని సూచిస్తున్నారు.
Similar News
News October 24, 2025
భారీ నుంచి అతిభారీ వర్షాలు

ఏపీలోని గుంటూరు, విజయవాడతో పాటు పశ్చిమ గోదావరి, కాకినాడ, అంబేడ్కర్ కోనసీమ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు అనకాపల్లి, ఏలూరు, తూర్పుగోదావరి, విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లోనూ వానలు పడతాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. అటు దక్షిణ తెలంగాణలోని ఉమ్మడి నల్గొండ, మహబూబ్‌నగర్, ఖమ్మం, మెదక్ జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలకు ఛాన్స్ ఉందని తెలిపారు.
News October 24, 2025
బస్సు ప్రమాదంలో 13మంది తెలంగాణవాసులు!

కర్నూలు బస్సు ప్రమాదం జరిగిన చోటుకు గద్వాల జిల్లా కలెక్టర్ సంతోష్, SP చేరుకున్నారు. ‘బస్సులో 13 మంది తెలంగాణవాసులు ప్రయాణించినట్లు తెలుస్తోంది. ఏడుగురికి కర్నూలు ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. క్షతగాత్రుల్లో నలుగురు HYD, ఖమ్మం, RR, సంగారెడ్డికి చెందినవారిగా గుర్తించాం. మిగిలిన ఆరుగురు చనిపోయారా, బతికున్నారా? అనే విషయం తెలియాల్సి ఉంది’ అని అన్నారు. హెల్ప్ లైన్ నంబర్స్: 9912919545, 9440854433.
News October 24, 2025
ప్రపంచబ్యాంకు నుంచి అమరావతికి మరో ₹1,750 కోట్లు!

AP: అమరావతి అభివృద్ధి కోసం ప్రపంచ బ్యాంకు రెండో విడతగా ₹1,750 కోట్లు ఇవ్వనుంది. డిసెంబర్ నాటికి ఈ ఫండ్స్ వచ్చే అవకాశం ఉందని పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి సురేశ్ తెలిపారు. ‘తొలి విడతలో WB విడుదల చేసిన ₹1,800 కోట్లలో 50% ఖర్చు చేశాం. ఇందులో 75% పూర్తయ్యాక రెండో విడత కోసం దరఖాస్తు చేస్తాం’ అని చెప్పారు. అమరావతి ప్రాజెక్టులకు ₹13,600 కోట్ల ఆర్థిక సాయం చేస్తామని గతంలో వరల్డ్ బ్యాంక్, ADB ప్రకటించాయి.


