News November 29, 2024

నెలకు రూ.1,500 అంటూ ప్రచారం.. పోస్టాఫీసులకు మహిళల క్యూ

image

APలో మహిళలు పోస్టాఫీసులకు క్యూ కడుతున్నారు. ఆడబిడ్డ నిధి కింద నెలకు రూ.1,500 అందాలంటే పోస్టాఫీసుల్లో ఖాతాలు తెరవాలని, ఇప్పటికే బ్యాంక్ అకౌంట్లు ఉన్నవారు ఆధార్, NPCIతో లింక్ చేసుకోవాలని కొందరు ప్రచారం చేస్తున్నారు. దీంతో పెద్దసంఖ్యలో మహిళలు పోస్టాఫీసుల చుట్టూ తిరుగుతున్నారు. అయితే ప్రభుత్వం ఇప్పటి వరకు ఆ పథకంపై ఎలాంటి ప్రకటన చేయలేదు. జరుగుతున్న ప్రచారంపై క్లారిటీ ఇవ్వాలని పలువురు కోరుతున్నారు.

Similar News

News January 22, 2026

నెక్స్ట్ నోటీసులు ఇచ్చేది కేసీఆర్‌కేనా?

image

TG: ఫోన్ ట్యాపింగ్ కేసు ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. BRS కీలక నేతలకు సిట్ వరుసబెట్టి నోటీసులు ఇస్తోంది. ఈ నెల 20న హరీశ్ రావును విచారించిన అధికారులు తాజాగా KTRకూ నోటీసులిచ్చారు. రేపు విచారణకు రావాలని ఆదేశించారు. కాగా నెక్స్ట్ సిట్ నుంచి నోటీసులు వచ్చేది BRS అధినేత KCRకేనని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

News January 22, 2026

సౌతాఫ్రికా WC జట్టులో మార్పులు

image

T20 WC జట్టులో SA మార్పులు చేసింది. బ్యాటర్లు జోర్జి, ఫెరీరా గాయాల వల్ల జట్టుకు దూరమయ్యారని, వారి స్థానాల్లో స్టబ్స్, రికెల్టన్‌ను తీసుకున్నట్లు వెల్లడించింది. మరోవైపు మిల్లర్ కండరాల గాయంతో బాధపడుతున్నారని, ఫిట్‌నెస్ టెస్టులో పాసైతేనే ఆయన WCలో ఆడతారని తెలిపింది.

టీమ్: మార్క్రమ్(C), బాష్, బ్రెవిస్, డికాక్, జాన్సెన్, లిండే, కేశవ్, మఫాకా, మిల్లర్, ఎంగిడి, నోర్ట్జే, రబాడ, రికెల్టన్, స్మిత్, స్టబ్స్

News January 22, 2026

చరిత్ర సృష్టించిన ‘సిన్నర్స్’

image

ర్యాన్ క్లూగర్ డైరెక్షన్‌లో మైఖేల్ బి.జోర్డాన్ నటించిన ‘సిన్నర్స్’ మూవీ రికార్డులు తిరగరాస్తోంది. తాజాగా ఆస్కార్ నామినేషన్స్‌లో 16 కేటగిరీల్లో చోటు దక్కించుకుంది. గతంలో All About Eve(1950), Titanic(1997), La La Land(2016) 14 కేటగిరీల చొప్పున నామినేషన్స్‌లో నిలిచాయి. ఇప్పుడు వాటి రికార్డును సిన్నర్స్ బద్దలుకొట్టింది. హారర్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం ఇటీవల గోల్డెన్ గ్లోబ్ అవార్డునూ అందుకుంది.