News November 29, 2024
MH ఎన్నికల ఓటింగ్ శాతంపై క్లారిటీ
MH ఎన్నికల్లో ఓటింగ్ శాతంపై <<14731795>>విమర్శలొస్తున్న<<>> వేళ ఆ రాష్ట్ర ఎన్నికల సంఘం స్పందించింది. ఓటింగ్ రోజు నవంబర్ 20న 5pmకు ఓటింగ్ 58.22%, మొత్తంగా 66.05% నమోదైందని చెప్పింది. 6pm వరకు క్యూలైన్లో వారు ఆ తర్వాత కూడా ఓట్లు వేశారంది. 2019లోనూ ఇలాగే పెరిగిందని స్పష్టం చేసింది. 5గంటల వరకు ఓటింగ్ శాతం ఫోన్ సంభాషణల ఆధారంగానే తీసుకున్నట్లు, ఫామ్ 17C సమాచారం, ఫైనల్ ఓటింగ్ శాతం ఒకేలా ఉందని తెలిపింది.
Similar News
News November 29, 2024
దిలావర్‌పూర్ ఇథనాల్ కంపెనీపై ప్రభుత్వం ప్రకటన
TG: దిలావర్ పూర్ ఇథనాల్ కంపెనీ వివరాలను ప్రభుత్వం బయటపెట్టింది. ఆ కంపెనీకి BRS హయాంలోనే అనుమతులు ఇచ్చి, ప్రజలను మోసం చేశారని ఆరోపించింది. కేంద్ర ప్రభుత్వం ఫ్యూయల్ ఇథనాల్‌కు మాత్రమే అనుమతులు ఇచ్చిందని, వాటిని BRS పట్టించుకోలేదంది. ఇథనాల్, ఎక్స్ ట్రా న్యూట్రల్ ఆల్కహాల్ ఉత్పత్తులకు గత మంత్రివర్గం అనుమతులు ఇచ్చిందని చెప్పింది. 2022 అక్టోబర్ 22న లెటర్ ఆఫ్ ఇండెంట్ జారీ చేసిందని పేర్కొంది.
News November 29, 2024
ఫోన్ ట్యాపింగ్ కేసు.. US సర్కార్‌కు ప్రభాకర్ రావు పిటిషన్
ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు తనను రాజకీయ శరణార్థిగా గుర్తించాలని US ప్రభుత్వాన్ని కోరారు. తనకు ఆరోగ్య సమస్యలున్నాయని, TG ప్రభుత్వం తనను ఇబ్బంది పెడుతోందని పిటిషన్‌లో పేర్కొన్నారు. ప్రస్తుతం ఫ్లోరిడాలో కుమారుడి వద్ద ఉంటున్నట్లు తెలిపారు. ఆయనను స్వదేశానికి రప్పించేందుకు, రెడ్ కార్నర్ నోటీసు జారీ చేయించేందుకు TG పోలీసులు ప్రయత్నిస్తున్నారు.
News November 29, 2024
హైకోర్టులో సజ్జలకు ఊరట
AP: టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో ప్రభుత్వ మాజీ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డికి హైకోర్టులో ఊరట కలిగింది. ఆయనపై పోలీసులు తొందరపాటు చర్యలు తీసుకోవద్దని గతంలో ఇచ్చిన ఆదేశాలను న్యాయమూర్తి మరోసారి పొడిగించారు. తదుపరి విచారణను వచ్చే నెల 9కి వాయిదా వేశారు.