News November 29, 2024

MBNR: ఆస్పత్రిలో బాలింత మృతి.. నర్సులపై వేటు

image

మహబూబ్‌నగర్ జిల్లా ఆస్పత్రిలో<<14731958>> బాలింత మృతి<<>> ఘటనలో ఇద్దరు నర్సులను వైద్యాధికారి సస్పెండ్ చేశారు. విధుల్లో నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. గండీడ్ మం. ఆసిరెడ్డిపల్లికి చెందిన రజిత కాన్పుకోసం బుధవారం ఆస్పత్రిలో చేరారు. రాత్రి బిడ్డకు జన్మనించిన ఆమె.. గురువారం ఉదయం చనిపోయారు. వైద్యుల నిర్లక్ష్యంతోనే చనిపోయిందని కుటుంబీకులు ఆందోళన చేపట్టారు. న్యాయం చేస్తామన్న హామీతో ఆందోళన విరమించారు.

Similar News

News March 13, 2026

MBNR: పదో తరగతి పరీక్షా కేంద్రాల వద్ద 163 సెక్షన్ అమలు: SP

image

పదో తరగతి వార్షిక పరీక్షల నేపథ్యంలో మహబూబ్‌నగర్ జిల్లాలోని అన్ని పరీక్షా కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు జిల్లా ఎస్పీ డి.జానకి తెలిపారు. పరీక్షా సమయాల్లో (ఉదయం 8:30 నుంచి మధ్యాహ్నం 1:30 వరకు) కేంద్రాలకు 200 మీటర్ల పరిధిలో 163 BNSS యాక్ట్ ప్రకారం ఐదుగురికి మించి గుంపులుగా ఉండకూడదని ఆదేశించారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు.

News March 13, 2026

మహబూబ్‌నగర్: ఫలించని జశ్వంత్ ప్రయత్నం

image

భూత్పూర్ మండలం వెల్కిచర్లలో గురువారం ఓ తల్లి పిల్లలతోకలిసి బావిలోదూకి ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఘటనలో ప్రాణాలతో బయటపడిన ఆమె కుమారుడు జశ్వంత్( 8)వారిని కాపాడేందుకు చేసిన ప్రయత్నంపట్ల గ్రామస్థులు ప్రశంసిస్తున్నారు. బాలుడు బావిలోని ఎత్తు ప్రదేశంలో పడటంతో ఒడ్డుకుచేరుకొని వెంటనే గ్రామంలోకి వెళ్లి గ్రామస్థులకు చెప్పడంతో గాలింపు చేపట్టారు. కానీ అప్పటికే తల్లి, కూతుళ్లు మృతి చెందారు.

News March 12, 2026

MBNR: ఈనెల 28న జాతీయ లోక్ అదాలత్ నిర్వహణ

image

మహబూబ్ నగర్ జిల్లా కోర్టులో ఈనెల 28వ తేదీన లోక్ అదాలత్ నిర్వహిస్తున్నామని జడ్జి ప్రేమలత తెలిపారు. రాజీ పడే ప్రతి కేసులను రాజు ద్వారానే పరిష్కారం చేసుకోవాలని రాజీ మార్గమే రాజమార్గం అని పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా 1334 కేసులను గుర్తించామని, అందులో 32 కేసులను పరిష్కారం చేశామని తెలిపారు. సివిల్, కుటుంబం, యాక్సిడెంట్, ఫ్రీ లిటిగేషన్ వంటి కేసులను పరిష్కారం చేసుకోవచ్చన్నారు.