News November 29, 2024

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కోసం BJP 43 కమిటీలు

image

వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరగనున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కోసం BJP వ్యూహాలు రచిస్తోంది. కేంద్ర ప్రభుత్వ పథకాల లబ్ధిదారులు, మహిళలు, యువత, SC, OBCలే లక్ష్యంగా ప్రచారానికి 43కమిటీలను నియమించింది. 70 సీట్లున్న ఢిల్లీపై జెండా ఎగరేయడమే లక్ష్యంగా ఆ పార్టీ రాష్ట్ర చీఫ్ వీరేంద్ర సచ్‌దేవా కమిటీలను ఎంపిక చేశారు. నామినేషన్లు, మీడియా వ్యవహారాలు, డేటా మేనేజ్‌మెంట్ తదితర ఎన్నికల పనులను ఈ కమిటీలు చేయనున్నాయి.

Similar News

News March 7, 2026

బాబీ డైరెక్షన్‌లో హృతిక్ రోషన్‌?

image

తాను త్వరలో బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్‌తో కలిసి పనిచేయనున్నానని రైటర్ కోన వెంకట్ ప్రకటించారు. ఆ సినిమాను బాబీ డైరెక్ట్ చేయనున్నట్లు చెప్పారు. అయితే, బాలీవుడ్ వర్గాలు మాత్రం ఈ ప్రాజెక్ట్ ఇంకా ఫైనల్ కాలేదంటున్నాయి. హృతిక్ ఓకే చెప్పలేదని.. కథ మాత్రమే విన్నారంటున్నాయి. ప్రస్తుతం ఆయన బిగ్ బడ్జెట్ మూవీ కోసం రెడీ అవుతున్నారని టాక్. అయితే ఆ మూవీయే కోన-బాబీ సినిమా అని మరికొంత మంది అంటున్నారు.

News March 7, 2026

చరిత్రలో ఈరోజు (మార్చి 7)

image

* 1921: తొలి తెలుగు సినీ నేపథ్య గాయకుడు ఎమ్.ఎస్ రామారావు జననం (ఫొటోలో)
* 1938: నోబెల్ గ్రహిత, జీవశాస్త్రవేత్త డేవిడ్ బాల్టిమోర్ జననం
* 1952: వెస్టిండీస్ క్రికెట్ మాజీ కెప్టెన్ వివియన్ రిచర్డ్స్ జననం
* 1955: బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ జననం
* 1952: ఆధ్యాత్మిక గురువు పరమహంస యోగానంద మరణం

News March 7, 2026

డిజిటల్ ఫ్రాడ్‌కు ₹25,000 పరిహారం!

image

₹50,000 లోపు సైబర్ మోసం జరిగితే కస్టమర్ పొరపాటు ఉన్నా ఒకేసారి గరిష్ఠంగా ₹25,000 వరకు పరిహారం అందించేలా RBI ప్రతిపాదనలు సిద్ధం చేసింది. 5 రోజుల్లోపు కంప్లైంట్ చేస్తే ఎలాంటి ప్రశ్నలు అడగకుండానే ఈ మొత్తాన్ని చెల్లిస్తారు. APR 6 వరకు ఈ ప్రతిపాదనలపై బ్యాంకులు అభిప్రాయం తెలియజేయొచ్చు. ఇవన్నీ ఓకే అయితే జులై 1 నుంచి అమల్లోకి వస్తాయి. సామాన్య కస్టమర్ల కష్టార్జితానికి రక్షణ కల్పించడమే దీని ప్రధాన ఉద్దేశం.