News November 29, 2024

REWIND: కేసీఆర్ అరెస్టు తర్వాత ఇదే జరిగింది..

image

2009 NOV 29న కరీంనగర్‌లోని తెలంగాణ భవన్ నుంచి దీక్ష శిబిరానికి వెళుతుండగా అలుగునూర్ చౌరస్తా వద్ద KCRని అరెస్ట్ చేశారు. అక్కడి నుంచి ఖమ్మం తరలించగా ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిన సంగతి తెలిసిందే. అయితే కేసీఆర్‌ను మొదట రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించాలనుకున్నారు. చివరకు ఖమ్మంకు తీసుకెళ్లారు. NOV 29 నుంచి DEC 2 వరకు ఖమ్మం జైలులో, ప్రభుత్వాసుపత్రిలో కేసీఆర్ ఉన్నారు. హ్యూమన్ రైట్స్ ఆదేశాలతో HYD తరలించారు.

Similar News

News April 7, 2026

ఖమ్మం: డయాగ్నోస్టిక్ హబ్‌లో పరీక్షలు నిల్‌

image

ప్రభుత్వ డయాగ్నస్టిక్ హబ్‌లో సాంకేతిక సమస్యలు రోగులకు శాపంగా మారాయి. యంత్రాల కాలం చెల్లడంతో నిత్యం జరిగే వేలాది పరీక్షలు నిలిచిపోయాయి. 2021 నుంచి లక్షలాది మందికి అండగా నిలిచిన ఈ కేంద్రం, నిర్వహణ లోపంతో ఇప్పుడు మూలనపడింది. ఉచిత సేవలు అందక సామాన్యులు ప్రైవేటు కేంద్రాలకు వెళ్లి వేల రూపాయలు ఖర్చు చేసుకుంటున్నారు. అధికారులు స్పందించి కొత్త యంత్రాలను ఏర్పాటు చేయాలని బాధితులు వేడుకుంటున్నారు.

News April 7, 2026

ఖమ్మం: పన్నుల వసూళ్లలో పంచాయతీల జోరు

image

ఖమ్మం జిల్లాలోని GPలు పన్నుల వసూళ్లలో రికార్డు స్థాయి పురోగతి సాధించాయి. నిర్దేశిత లక్ష్యం ₹15.34 కోట్లు కాగా, మార్చి 31 నాటికి ₹13.87 కోట్లు (90%) వసూలు కావడం విశేషం. అధికారుల సమన్వయం, పాలకవర్గాల చొరవతో ఈ విజయం సాధ్యమైంది. మండలాల వారీగా చూస్తే 94 % వసూళ్లతో కొణిజర్ల అగ్రస్థానంలో నిలవగా, 87 %తో చింతకాని మండలం వెనుకబడింది. ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి శతశాతం వసూళ్లే ధ్యేయంగా యంత్రాంగం కదులుతోంది.

News April 7, 2026

ఖమ్మం: మిల్లుల్లోనే ధాన్యం.. రైతన్నకు దైన్యం

image

ఖమ్మం జిల్లాలో ధాన్యం నిల్వలు రైస్ మిల్లుల్లోనే మూలుగుతున్నాయి. వానాకాలం సేకరించిన 2.30 లక్షల మెట్రిక్ టన్నుల్లో.. ఇప్పటికీ లక్ష టన్నుల మేర బియ్యంగా మారక మగ్గిపోతున్నాయి. ఫలితంగా యాసంగి కొనుగోళ్లపై అనిశ్చితి నెలకొంది. పలు మండలాల్లో పంట చేతికొచ్చినా కొనుగోలు కేంద్రాలు ప్రారంభించకపోవడంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. పాత నిల్వలు ఖాళీ కాకపోతే కొత్త ధాన్యం పరిస్థితి ఏంటని రైతులు ప్రశ్నిస్తున్నారు.