News November 29, 2024
చిత్తూరు: తల్లిని కొట్టి చంపిన కానిస్టేబుల్.. UPDATE

తాగేందుకు డబ్బులు ఇవ్వలేదని కొడుకు కొట్టడంతో తల్లి మృతి చెందిన ఘటన చిత్తూరులో జరిగింది. సీఐ నెట్టికంటయ్య వివరాల ప్రకారం.. చిత్తూరు నగరంలోని రోసీనగర్‌లో ఉంటున్న వసంతమ్మ(63)కు ఇద్దరు కుమారులు. పెద్దకొడుకు శంకర్ చిత్తూరు పోలీసుశాఖలో కానిస్టేబుల్‌గా పని చేస్తూ సస్పెండ్ అయ్యాడు, మరో కొడుకు జ్యోతికుమార్ ఓ కంపెనీలో పనిచేస్తున్నాడు. తాగేందుకు డబ్బులు ఇవ్వలేదని శంకర్ తల్లిని కొట్టడంతో చనిపోయింది.
Similar News
News January 19, 2026
చిత్తూరు: సమస్యలపై ఫిర్యాదుల వెల్లువ

జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ తుషార్ డూడీ ఆధ్వర్యంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. బాధితుల నుంచి ఎస్పీ అర్జీలు స్వీకరించారు. వివిధ సమస్యలపై 23 ఫిర్యాదుల అందినట్లు అధికారులు వెల్లడించారు. ఇందులో నగదు లావాదేవీలు 4, భూతగాదాలు 7, వేధింపులపై 3 ఫిర్యాదులు అందాయన్నారు. వీటిని సత్వరమే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని ఎస్పీ ఆదేశించారు. మరోవైపు కలెక్టర్‌కు సైతం 113 ఫిర్యాదులు అందాయి.
News January 19, 2026
చిత్తూరు: వేమనకు నివాళులర్పించిన ఎస్పీ

యోగి వేమన జయంతిని పురస్కరించుకొని ఆయన చిత్రపటానికి ఎస్పీ తుషార్ డూడీ సోమవారం నివాళులు అర్పించారు. చిత్తూరు సాయుధ దళం కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలా పద్యాలను రచించి, ప్రజలను మెప్పించిన మహాకవి అని కొనియాడారు. ఆయన జయంతిని రాష్ట్ర వేడుకగా నిర్వహించడం భావితరాలకు స్ఫూర్తి దాయకమన్నారు.
News January 19, 2026
గంగవరం డ్రైవర్స్ కాలనీలో జోరుగా వ్యభిచారం?

గంగవరం(M) డ్రైవర్స్ కాలనీలో జోరుగా వ్యభిచారం నిర్వహిస్తున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. మదనపల్లె, చిత్తూరు తదితర ప్రాంతాల నుంచి అమ్మాయిలను రప్పించి ఓ మహిళ వ్యభిచార గృహం నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. గత కొన్నేళ్లుగా ఇక్కడ వ్యభిచారం నిర్వహిస్తున్నా ఎటువంటి చర్యలు లేకపోవడం గమనార్హం. నిత్యం కాలేజీ విద్యార్థులు, బయట ప్రాంతాల నుంచి విటులు రావడంతో గ్రామస్థులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు.


