News November 29, 2024
పురిటి నొప్పులతో మహిళ.. ఆదోనిలో బైక్‌పై ప్రసవం

నిండు గర్భిణి బైక్‌పైనే ప్రసవించిన ఘటన ఆదోనిలో జరిగింది. క్రాంతినగర్‌కు చెందిన మహిళ లలితకు నిన్న పురిటి నొప్పులు రాగా ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు కుటుంబ సభ్యులు సిద్ధమయ్యారు. సమయానికి ఆటోలు లేకపోవడంతో బైక్‌పైనే ఆమెను ఎక్కించుకుని బయలుదేరారు. కొంత దూరం వెళ్లగానే నొప్పులు ఎక్కువై బిడ్డ తల బయటకి వచ్చింది. వెంటనే సమీపంలోని జనరల్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. వైద్యులు నార్మల్ డెలివరీ చేయగా కవలలు జన్మించారు.
Similar News
News January 17, 2026
రైతుల ఆదాయం పెంచడమే లక్ష్యం: కలెక్టర్

రైతుల ఆదాయం పెంపే లక్ష్యంగా మండల స్థాయిలో కార్యాచరణాత్మక వ్యవసాయ ప్రణాళికలు అమలు చేయాలని జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి ఆదేశించారు. ఈ-క్రాప్ బుకింగ్‌ను నిర్దేశిత గడువులోపు పూర్తి చేయాలని, వరికి బదులుగా మల్లెపూలు, డ్రాగన్ ఫ్రూట్, బొప్పాయి, అరటి వంటి పంటలను ప్రోత్సహించాలని సూచించారు. పంట సేకరణ, మార్కెటింగ్‌లో రైతులకు ఇబ్బందులు లేకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని తెలిపారు.
News January 17, 2026
కర్నూలు: సంక్రాంతి నాడు విషాదాంతాలు

సంక్రాంతి పండుగ నాడు పలు కుటుంబాల్లో విషాదం మిగిలింది. పుల్లూరు టోల్ ప్లాజా వద్ద బైక్ ఢీకొని ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు మృతిచెందారు. పాణ్యం(M) తమ్మరాజుపల్లెలో వాహనం ఢీకొని రత్నమ్మ(50) మరణించింది. బేతంచెర్ల(M) శంకలాపురం గ్రామానికి చెందిన దస్తగిరి(33) బొలెరో ఢీకొని చనిపోయాడు. అప్పుల బాధతో గోనెగండ్లలో కౌలు రైతు జైనుద్దీన్, ఆదోనికి చెందిన వెంకటేశ్(42), కర్నూలుకు చెందిన శివకుమార్(33) ఉరేసుకున్నారు.
News January 17, 2026
కర్నూలు: భార్యను వదిలేసిన టీచర్‌కు రిమాండ్!

DSC కోచింగ్‌లో పరిచయమైన యువతిని ప్రేమించి, పెళ్లి చేసుకొని వదిలేసిన సంజామల(M) ఆకుమల్లకు చెందిన టీచర్ కలింగిరి మహేశ్‌ను కోవెలకుంట్ల కోర్టు 14రోజుల రిమాండ్‌కు పంపింది. కర్నూలు(D) సి.బెళగల్(M) కంబదహాల్‌కు చెందిన సారమ్మతో రెండేళ్లు సహజీవనం చేసి ఉద్యోగం రాగానే దూరం పెట్టాడు. యువతి ఒత్తిడితో ఎవరికీ తెలియకుండా గుడిలో పెళ్లి చేసుకున్నాడు. తర్వాత ఆమెను వదిలేశాడు. దీంతో యువతి సంజామల పోలీసులను ఆశ్రయించింది.


