News November 29, 2024

500 కేజీల డ్రగ్స్ పట్టివేత

image

అరేబియా సముద్రంలో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. భారత నేవీ 500 కేజీల మాదకద్రవ్యాలను పట్టుకుంది. ఫిషింగ్ బోట్లలో డ్రగ్స్ తరలిస్తుండగా స్వాధీనం చేసుకున్నారు. శ్రీలంక నేవీతో కలిసి భారత నౌకాదళం ఈ ఆపరేషన్ చేపట్టింది.

Similar News

News January 14, 2026

ఇండియా ఆప్టెల్ లిమిటెడ్‌లో 150 పోస్టులు.. అప్లైకి ఎల్లుండే లాస్ట్ డేట్

image

<>రాయ్‌పుర్‌<<>>లోని ఇండియా ఆప్టెల్ లిమిటెడ్‌లో 150 పోస్టులకు అప్లై చేయడానికి ఎల్లుండే ఆఖరు తేదీ. పోస్టులను బట్టి టెన్త్+NTC/నేషనల్ అప్రెంటిస్ సర్టిఫికెట్ కలిగిన వారు ఆఫ్‌లైన్‌లో అప్లై చేసుకోవాలి. వయసు 18 -32ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. విద్యార్హతల మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: ddpdoo.gov.in/

News January 14, 2026

తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ

image

AP: తిరుమలలో భక్తుల రద్దీ కాస్త తగ్గింది. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 6 గంటల సమయం పడుతోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని 4 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న శ్రీవారిని 73,014 మంది దర్శించుకోగా.. 19,639 మంది తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం రూ.4.27 కోట్లు వచ్చినట్లు టీటీడీ వెల్లడించింది.

News January 14, 2026

యాంటీబయాటిక్స్‌తో ఎర్లీ ప్యూబర్టీ

image

పుట్టిన తొలినాళ్లలో యాంటీబయోటిక్స్‌ వాడిన ఆడపిల్లల్లో ఎర్లీ ప్యూబర్టీ వస్తున్నట్లు తాజా అధ్యయనంలో వెల్లడైంది. దక్షిణ కొరియాకి చెందిన యూనివర్సిటీ ఆసుపత్రులు చేసిన అధ్యయనంలో ఏదైనా అనారోగ్య కారణంతో ఏడాదిలోపు- ముఖ్యంగా తొలి మూడునెలల్లో- యాంటీబయోటిక్స్‌ తీసుకున్న ఆడపిల్లల్లో 22 శాతం మంది ఎనిమిదేళ్లకంటే ముందుగానే రజస్వల అవడాన్ని గమనించారు. ఈ పరిస్థితిని సెంట్రల్‌ ప్రికాషియస్‌ ప్యుబర్టీ అంటారు.