News November 29, 2024

రాజధానిలో భూ కేటాయింపులపై కేబినెట్ సబ్ కమిటీ భేటీ

image

రాజధానిలో సంస్థలకు భూకేటాయింపులపై మంత్రివర్గ ఉప సంఘం శుక్రవారం సాయంత్రం 4 గంటలకు భేటీ కానుంది. అమరావతి ప్రాంతంలో గతంలో పలు భూకేటాయింపులపై సంస్థల ఏర్పాటు, కొత్తగా భూ కేటాయింపులకు వచ్చిన ప్రతిపాదనలపై ముఖ్యంగా ఈ సమావేశంలో చర్చించనున్నారు. కేబినెట్ సబ్ కమిటీలో సభ్యులుగా ఉన్న మంత్రులు నారాయణ, కేశవ్, కొల్లు రవీంద్ర, దుర్గేశ్, టీజీ భరత్, సంధ్యారాణి, పలు శాఖల ఉన్నతాధికారులు హాజరుకానున్నారు. 

Similar News

News March 13, 2026

తెనాలిలో రన్నింగ్ బస్సు కిందకి దూసుకెళ్లిన టెన్త్ విద్యార్థి

image

తెనాలి మారీసుపేటలోని హైస్కూల్‌కు చెందిన 10వ తరగతి విద్యార్థి లీలాసాయి మణికంఠ ఒక్కసారిగా బస్సు కిందకి దూసుకు వెళ్లినట్లు స్థానికులు తెలిపారు. కొత్త వంతెన వద్ద డివైడర్‌పై నడిచి వెళుతున్న అతను అదే సమయంలో నగరం నుంచి తెనాలి వస్తున్న RTC బస్సు కిందకు దూసుకు వెళ్లాడు. డ్రైవర్ గమనించి బ్రేక్ వేయడంతో ప్రమాదం తప్పింది. స్పృహ కోల్పోయిన విద్యార్థిని ఆస్పత్రికి తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News March 13, 2026

గుంటూరు: రేపు జాతీయ లోక్ అదాలత్

image

జాతీయ లోక్ అదాలత్‌ను ఈ నెల 14న నిర్వహిస్తున్నట్లు గుంటూరు జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఛైర్మన్ బి.సాయి కళ్యాణ్ చక్రవర్తి తెలిపారు. 14న ఉదయం 10 గంటల నుంచి జిల్లా న్యాయస్థానం ఆవరణలో లోక్ అదాలత్ జరుగుతుందన్నారు. ఈ జాతీయ లోక్ అదాలత్‌లో సివిల్, కాంపౌండబుల్, క్రిమినల్ కేసులు, కుటుంబ, వివాహ సమస్యలు పరిష్కరించుకోవచ్చని చెప్పారు.

News March 13, 2026

GNT: గ్యాస్ వినియోగదారులకు హెల్ప్ లైన్ నెంబర్

image

గుంటూరు జిల్లాలో LPG కొరత లేదని, వినియోగదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అధికారులు తెలిపారు. గ్యాస్ నిల్వలు తగ్గుతాయనే ప్రచారాలను నమ్మవద్దని సూచించారు. జిల్లాలో గ్యాస్ సరఫరాపై పర్యవేక్షణ కోసం ప్రత్యేక కంట్రోల్ రూమ్ 8309160972, 6309520569 ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. అవసరాలకు తగిన విధంగా సిలిండర్ల సరఫరా కొనసాగుతుందని తెలిపారు.