News November 29, 2024
మోదీ పక్కన లేడీ కమాండో.. ఎవరామె?
PM మోదీ పక్కన ఉన్న మహిళా కమాండో ఫొటో వైరల్ అయింది. BJP MP కంగన ఇన్‌స్టాగ్రామ్‌లో ఫొటో పోస్ట్ చేయగా, ఆమె ప్రత్యేక శిక్షణ తీసుకున్న SPG అంటూ నెట్టింట చర్చ జరిగింది. దీనిపై భద్రతా వర్గాలు స్పందించాయి. కొందరు మహిళా SPG కమాండోలు క్లోజ్ ప్రొటెక్షన్ టీమ్‌లో ఉంటారని, ఈ లేడీ కమాండో SPG కాదంది. ఆమె రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పర్సనల్ సెక్యూరిటీ ఆఫీసర్ అని, అలాగే CRPF అసిస్టెంట్ కమాండెంట్ అని వివరించింది.
Similar News
News December 26, 2024
భాగవత్‌తో విభేదించిన RSS మ్యాగజైన్
మసీదు-మందిర్ వివాదాలపై RSS చీఫ్ మోహన్ భాగవత్‌తో ఆ శాఖ అనుబంధ మ్యాగజైన్ విభేదించింది. ఈ తరహా వివాదాలు అధికమవుతుండడంపై భాగవత్ గతంలో ఆందోళన వ్యక్తం చేశారు. భారతీయులు కలిసి ఉండగలరన్న ఐక్యత చాటాలని పిలుపునిచ్చారు. అయితే RSSకు చెందిన ఓ మ్యాగజైన్ మాత్రం సివిలైజేషన్ జస్టిస్ కోసం వివాదాస్పద స్థలాలు, నిర్మాణాల వాస్తవ చరిత్రను తెలుసుకోవడం చాలా ముఖ్యమని పేర్కొనడం గమనార్హం.
News December 26, 2024
ముఖ్యమంత్రి పదవినే వద్దనుకున్నా: సోనూ సూద్
తనకు రాజకీయాల్లో చాలా ఆఫర్లు వచ్చాయని సినీ నటుడు సోనూ సూద్ తెలిపారు. సీఎం, డిప్యూటీ సీఎం, రాజ్యసభ సభ్యుడు వంటి పదవుల ఆఫర్లు వచ్చాయని చెప్పారు. ‘కొందరు బడా నేతలు నన్ను సీఎంగా బాధ్యతలు తీసుకోవాలన్నారు. కానీ నేను దానికి అంగీకరించలేదు. నేను రాజకీయాల్లోకి వస్తే జవాబుదారీతనంతో ఉండాలి. కానీ అది నాకు నచ్చదు. ఇప్పుడు నేను స్వేచ్ఛగా సేవ చేస్తున్నా. ఇకపై కూడా ఇలాగే ఉంటా’ అని ఆయన చెప్పుకొచ్చారు.
News December 26, 2024
ఇండియన్స్‌కు తక్కువ జీతం ఇవ్వొచ్చు : అమెరికా కంపెనీ ఫౌండర్
భారత ఉద్యోగులపై నియర్ కో ఫౌండర్ ఫ్రాంకో పెరేరా చేసిన వ్యాఖ్యలపై విమర్శలొస్తున్నాయి. ఆర్థిక పరిస్థితులు, జీవన వ్యయాన్ని పరిగణనలోకి తీసుకుని US వారికంటే భారతీయులకు తక్కువ వేతనం ఇవ్వడం తప్పుకాదని ఆయన linkedinలో పోస్ట్ చేశారు. ఇండియా, లాటిన్ అమెరికా, ఫిలిప్పీన్స్ గురించి ఇలా చెప్పారు. సమానమైన పని చేస్తున్నప్పటికీ ఇండియన్స్ ఇలా పనిదోపిడీకి గురవుతున్నట్లు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.