News November 29, 2024

2300 బంతుల్లో 2000 పరుగులు.. బ్రూక్ రికార్డ్

image

న్యూజిలాండ్‌తో జరుగుతోన్న టెస్టు సిరీస్‌లో ఇంగ్లండ్ ప్లేయర్ హ్యారీ బ్రూక్ అదరగొడుతున్నారు. ఇప్పటికే 70+ పరుగులు చేసి టెస్టుల్లో 2000 పరుగులు పూర్తి చేసుకున్నారు. 36 ఇన్నింగ్స్‌లో 2300 బంతులను ఎదుర్కొన్న ఆయన 86.96 స్ట్రైక్ రేట్‌తో 6 సెంచరీలు, 10 అర్ధ సెంచరీలు పూర్తి చేశారు. దీంతో తక్కువ బంతుల్లో 2వేల రన్స్ పూర్తి చేసుకున్న రెండో ప్లేయర్‌గా నిలిచారు. బెన్ డకెట్ (2293 బంతులు) ప్రథమ స్థానంలో నిలిచారు.

Similar News

News February 4, 2026

$852 బిలియన్లకు మస్క్ సంపద

image

స్పేస్‌ఎక్స్, xAI విలీనంతో ఎలాన్ మస్క్ చరిత్ర సృష్టించారు. ఫోర్బ్స్ ప్రకారం.. ఈ డీల్ తర్వాత ఆయన నెట్ వర్త్ $852 బిలియన్లకు చేరింది. దీంతో ప్రపంచ చరిత్రలోనే అత్యంత సంపన్న వ్యక్తిగా ఆయన నిలిచారు. విలీనం తర్వాత ఏర్పడిన కొత్త సంస్థ విలువ $1.25 ట్రిలియన్లుగా ఉండగా ఈ ఒక్క ఒప్పందం వల్లే మస్క్ సంపదకు అదనంగా $84 బిలియన్లు తోడయ్యాయి. మస్క్ తర్వాత లారీ పేజ్ $278 బిలియన్లతో రెండో స్థానంలో ఉన్నారు.

News February 4, 2026

మమత పిటిషన్‌పై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం.. ఈసీకి నోటీసులు

image

బెంగాల్‌లో ఓటర్ల జాబితా సవరణ కోసం భారత ఎన్నికల సంఘం చేపట్టిన SIR ప్రక్రియపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ ప్రక్రియ వల్ల లక్షలాది మంది ఓటర్ల హక్కులకు భంగం కలుగుతుందని ఆరోపిస్తూ CM మమతా బెనర్జీ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీం ECIకి నోటీసులిచ్చింది. ముఖ్యమంత్రే స్వయంగా హాజరై తన వాదనలు వినిపించారు. ఒక సిట్టింగ్ సీఎం ఇలా నేరుగా కోర్టులో వాదించడం భారత న్యాయ చరిత్రలో ఇదే తొలిసారి.

News February 4, 2026

రబీ జొన్నలో కలుపు నివారణకు సూచనలు

image

జొన్న విత్తిన 30-35 రోజుల వరకు కలుపు లేకుండా చూసుకోవాలి. విత్తిన 48 గంటలలోపు ఎకరాకు 800 గ్రా. అట్రజిన్‌ (50%) పొడి మందును 200 లీటర్ల నీటిలో కలిపి నేలపై సమంగా పిచికారీ చేస్తే 35 రోజుల వరకు కలుపు సమస్య ఉండదు. విత్తిన 30, 60 రోజులకు గుంటక లేదా దంతితో వరుసల మధ్య అంతర కృషి చేసుకోవాలి. దీని వలన కలుపు నివారణతో పాటు తేమ నిలిచి పంట చివరి దశలో బెట్టకు గురికాకుండా ఉంటుంది.