News November 29, 2024
పుతిన్‌కు మరో సీక్రెట్ డాటర్!

రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు ఎలిజావెటా క్రివోనోగిఖ్(21) అనే సీక్రెట్ కూతురు ఉన్నట్లు ఓ ఉక్రెయిన్ మీడియా వెల్లడించింది. ఆమె తన పేరును లూయిజా రోజోవాగా మార్చుకుని రెండేళ్లుగా పారిస్‌లో జీవిస్తున్నట్లు తెలిపింది. పుతిన్, ప్రేయసి స్వెత్లానాలకు ఈమె జన్మించినట్లు పేర్కొంది. మాజీ భార్య లియుడ్మిలాతో పుతిన్‌కు ఇద్దరు ఆడబిడ్డల సంతానం కలిగారు. ఒలింపిక్ జిమ్నాస్ట్ అలీనాతో ఇద్దరు కొడుకులు ఉన్నట్లు సమాచారం.
Similar News
News March 8, 2026
WBలో ప్రొటోకాల్ వివాదం.. అమిత్ షా, CBN ఏమన్నారంటే

ప.బెంగాల్‌లోని TMC ప్రభుత్వం తమ అరాచక ప్రవర్తనతో అథఃపాతాళానికి దిగజారిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా మండిపడ్డారు. ‘ప్రోటోకాల్ పాటించకుండా రాష్ట్రపతిని అవమానించారు. <<19322594>>ఈ ఘటన<<>> దేశానికి, ప్రజాస్వామ్యానికి అవమానం’ అని ట్వీట్ చేశారు. రాష్ట్రపతిని అవమానించేలా WB ప్రభుత్వం వ్యవహరించడం దురదృష్టకరమని, ఈ ఘటన బాధ కలిగించిందని AP CM CBN తెలిపారు. రాష్ట్రపతి పట్ల గౌరవంతో మెలగాలన్నారు.
News March 8, 2026
చరిత్రలో ఈరోజు (మార్చి 8)

1897: చిత్రకారుడు దామెర్ల రామారావు జననం
1917: విద్యుత్తు రంగ నిపుణుడు నార్ల తాతారావు జననం
1989: భారత మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ జననం
1993: చిలకలూరిపేట బస్సు దహనం ఘటనలో 23 మంది మృతి
2012: సినీ నటి రాధాకుమారి మరణం
☛ అంతర్జాతీయ మహిళా దినోత్సవం
News March 8, 2026
పుట్టిన రోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపరచండి.


