News November 29, 2024
అమెరికాలో చదివే భారత విద్యార్థులకు అలర్ట్
అమెరికాలో చదువుతున్న భారత విద్యార్థులతో పాటు ఇతర దేశాల స్టూడెంట్లకు అక్కడి యూనివర్సిటీలు కీలక సూచనలు చేశాయి. శీతాకాలం సెలవులకు స్వదేశానికి వెళ్లిన విద్యార్థులు ట్రంప్ అధ్యక్షుడిగా ప్రమాణం చేయడానికి (జనవరి 20) ముందే USA వచ్చేయాలని మెసేజులు పంపుతున్నాయి. వ్యాలిడ్ వీసాలు ఉన్న విద్యార్థులకు ట్రంప్ విధానాలతో ఎలాంటి ఇబ్బందులు లేకపోయినా ఛాన్స్ తీసుకోకూడదని యూనివర్సిటీలు భావిస్తున్నట్లు సమాచారం.
Similar News
News November 29, 2024
GDP SHOCK: 7 త్రైమాసికాల్లోనే అత్యల్పం
FY25 Q2లో జీడీపీ వృద్ధిరేటు 5.4%గా నమోదైంది. చివరి త్రైమాసికంలోని 6.7%, గతేడాది ఇదే టైమ్‌లోని 8.1%తో పోలిస్తే బాగా మందగించింది. చివరి 7 త్రైమాసికాల్లో ఇదే అత్యల్పం కావడం గమనార్హం. ఆర్థిక కార్యకలాపాల్లో కీలకమైన GVA 5.6 శాతానికి పెరిగినా FY24 Q2 నాటి 7.7%తో పోలిస్తే తగ్గింది. తయారీ, మైనింగ్ రంగాల్లో వృద్ధిరేటు, పబ్లిక్ స్పెండింగ్, కన్జంప్షన్, కార్పొరేట్ ఎర్నింగ్స్ తగ్గడమే మందగమనానికి కారణాలు.
News November 29, 2024
గుండె లేకపోయినా..!
ఎవరైనా కఠిన నిర్ణయాలు తీసుకుంటే ‘అబ్బా.. నీకు హార్ట్ లేదబ్బా’ అని ఎదుటి వ్యక్తులు అంటుంటారు. అయితే, నిజంగానే హార్ట్ లేని వ్యక్తి గురించి మీకు తెలుసా? 2011లో క్రైగ్ లూయిస్ అనే 55 ఏళ్ల వ్యక్తికి అమిలోయిడోసిస్ కారణంగా గుండె, కిడ్నీలు, లివర్ ఫెయిల్ అయ్యాయి. దీంతో టెక్సాస్ హార్ట్ ఇన్స్టిట్యూట్ వైద్యులు అతనికి గుండెకు బదులు ఓ పరికరాన్ని అమర్చి మరికొన్నిరోజులు బతికేలా చికిత్స చేశారు.
News November 29, 2024
సమంత తండ్రి మృతి
టాలీవుడ్ హీరోయిన్ సమంత తండ్రి జోసెఫ్ ప్రభు గుండెపోటుతో మృతి చెందారు. ఈ విషయాన్ని ఆమె ఇన్‌స్టా ద్వారా వెల్లడించారు. ‘నాన్నను ఇక కలవలేను’ అని పేర్కొంటూ ఆమె హార్ట్ బ్రేకింగ్ ఎమోజీని షేర్ చేశారు. దీంతో సమంతకు సానుభూతి తెలియజేస్తూ ఆమె అభిమానులు నెట్టింట పోస్టులు పెడుతున్నారు.