News November 29, 2024
వివేకా హత్య కేసు.. భాస్కర్ రెడ్డికి సుప్రీం నోటీసులు
మాజీ మంత్రి వివేకా హత్య కేసులో వైఎస్ భాస్కర్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలన్న సీబీఐ పిటిషన్‌ను సుప్రీంకోర్టు విచారించింది. సీజేఐ నేతృత్వంలోని ధర్మాసనం ఆయనకు నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో మిగిలిన నిందితుల బెయిల్ రద్దు పిటిషన్లతోపాటు దీన్ని జతచేయాలని సునీత తరఫు లాయర్ కోరారు. దీంతో ఆ మేరకు సుప్రీం ఆదేశాలిచ్చింది.
Similar News
News November 29, 2024
గుండె లేకపోయినా..!
ఎవరైనా కఠిన నిర్ణయాలు తీసుకుంటే ‘అబ్బా.. నీకు హార్ట్ లేదబ్బా’ అని ఎదుటి వ్యక్తులు అంటుంటారు. అయితే, నిజంగానే హార్ట్ లేని వ్యక్తి గురించి మీకు తెలుసా? 2011లో క్రైగ్ లూయిస్ అనే 55 ఏళ్ల వ్యక్తికి అమిలోయిడోసిస్ కారణంగా గుండె, కిడ్నీలు, లివర్ ఫెయిల్ అయ్యాయి. దీంతో టెక్సాస్ హార్ట్ ఇన్‌స్టిట్యూట్ వైద్యులు అతనికి గుండెకు బదులు ఓ పరికరాన్ని అమర్చి మరికొన్నిరోజులు బతికేలా చికిత్స చేశారు.
News November 29, 2024
సమంత తండ్రి మృతి
టాలీవుడ్ హీరోయిన్ సమంత తండ్రి జోసెఫ్ ప్రభు గుండెపోటుతో మృతి చెందారు. ఈ విషయాన్ని ఆమె ఇన్‌స్టా ద్వారా వెల్లడించారు. ‘నాన్నను ఇక కలవలేను’ అని పేర్కొంటూ ఆమె హార్ట్ బ్రేకింగ్ ఎమోజీని షేర్ చేశారు. దీంతో సమంతకు సానుభూతి తెలియజేస్తూ ఆమె అభిమానులు నెట్టింట పోస్టులు పెడుతున్నారు.
News November 29, 2024
బీమారంగంలో 100% FDIకి కేంద్రం సై!
భారత బీమా కంపెనీల్లో FDI పరిమితిని 74 నుంచి 100 శాతానికి పెంచాలని కేంద్రం యోచిస్తోంది. వేర్వేరు బీమా వ్యాపారాలను నిర్వహించేందుకు కంపెనీలకు అనుమతించాలని భావిస్తోంది. ఇదే జరిగితే ఇక అన్ని కంపెనీలూ లైఫ్, హెల్త్, జనరల్ ఇన్సూరెన్స్ సేవల్ని అందించేందుకు వీలవుతుంది. ఇక ఫారిన్ రీఇన్సూరర్స్ సొంత నిధుల అవసరాన్ని రూ.5000 కోట్ల నుంచి రూ.1000 కోట్లకు తగ్గించాలని ప్రతిపాదించింది. ప్రజాభిప్రాయాన్ని కోరుతోంది.