News November 29, 2024

విశాఖ కాస్త వైజాగ్‌‌గా ఎలా మారింది?

image

విశాఖ పేరు వెనుక ఒక చరిత్రే ఉంది. వైశాఖేశ్వరుని ఆలయం చుట్టూ నగరం విస్తరించిందని, వైశాఖ కాస్త విశాఖగా మారిందని పలు కథనాలు ప్రాచుర్యంలో ఉన్నాయి. నగరంలో కుమార స్వామి ఆలయం ఉండేదని అతని నక్షత్రం విశాఖ కావడంతో నగరానికి ఆ పేరు వచ్చిందనేది మరో కథనం. కాగా బ్రిటిష్ వారు విశాఖపట్నం పేరు పలకలేక వైజాగపట్నం అనే వారు. అది కాస్త వైజాగ్‌గా మారింది. నగరానికి విశాఖ పేరు ఎలా వచ్చిందో మీకు తెలిసిన కథ కామెంట్ చేయండి.

Similar News

News December 28, 2025

భీమిలికి పెరుగుతున్న వలసలు

image

భీమిలిలో పెట్టుబడులు వెల్లువలా వస్తున్నాయని ప్రభుత్వం చెబుతుంటే.. వలస పక్షులు వాలుతున్నాయి. ఇంతకాలం పిల్లల చదువుల కోసం స్టీల్ సిటీకి వచ్చేవారు. ఇప్పుడు ఉపాధి పెరుగుతుండడంతో వలసలు మొదలయ్యాయి. ఉత్తరాంధ్రలో పారిశ్రామిక, ఐటీ పురోగతి పెరగడంతో మైగ్రేషన్‌ పెరుగుతోందని గణాంకాలు చెబుతున్నాయి. రాష్ట్రంలోనే అత్యధిక ఓటర్లు ఉన్న నియోజకవర్గాల్లో మొదటి రెండు స్థానాల్లో భీమిలి, గాజువాక నిలిచాయి.

News December 28, 2025

విశాఖలో వ్యభిచార గృహంపై దాడి

image

విశాఖ ఎయిర్ పోర్ట్ పోలీస్ స్టేషన్ పరిధి జ్యోతి నగర్‌లోని ఓ ఇంట్లో వ్యభిచారం జరుగుతున్నట్లు సమాచారం రావడంతో టాస్క్‌ఫోర్స్ పోలీసులు శనివారం సాయంత్రం దాడి చేశారు. ఈ దాడిలో ముగ్గురు మహిళలు, ఇద్దరు విటులు జ్యోతిష్, హర్షిత్‌ని అరెస్ట్ చేసి ఎయిర్ పోర్ట్ పోలీస్ స్టేషన్‌కు అప్పగించారు. వారిపై కేసు నమోదు చేసి విటులను, నిర్వాహకురాలిని రిమాండ్‌కి తరలించారు.

News December 28, 2025

విశాఖ సీపీకి డీజీగా పదోన్నతి

image

విశాఖ సీపీగా విధులు నిర్వహిస్తున్న శంఖబ్రత బాగ్చీకి డీజీగా పదోన్నతి కల్పిస్తూ ప్రభుత్వ కార్యదర్శి కే.విజయానంద్ శనివారం ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేశారు. 1996 బ్యాచ్‌కి చెందిన శంఖబ్రత బాగ్చీ పలు ప్రాంతాల్లో వివిధ హోదాల్లో పనిచేశారు. ప్రస్తుతం విశాఖలో సీపీగా సేవలందిస్తున్నారు. కమిషనర్ రాకతో పోలీసుల సంక్షేమానికి, అభివృద్ధికి, ప్రజోపకార పనులు చేశారు.