News November 29, 2024

బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు సిద్ధమైన GHMC

image

బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు GHMC సిద్ధమైంది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌‌ని రూ.8,600 కోట్లతో ప్రవేశపెట్టేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. మొదట బడ్జెట్‌ ప్రతిపాదనపై మేయర్‌ అధ్యక్షతన జరిగే స్టాండింగ్‌ కమిటీ సమావేశంలో సభ్యులు చర్చించి, ఆ తర్వాత సర్వసభ్య సమావేశంలో తీర్మానం చేసి ప్రభుత్వానికి అందజేయనున్నారు. కాగా, 2024-25 బడ్జెట్‌ రూ.7,937 కోట్లు. దీనిపై మీ కామెంట్?

Similar News

News March 13, 2026

RR: ‘పది’ పరీక్షలకు సర్వం సిద్ధం.. 53,058 విద్యార్థులు

image

పదో తరగతి వార్షిక పరీక్షలు ఈనెల 14వ తేదీ నుంచి ప్రారంభంకానున్నాయి. పరీక్షలు శనివారం ప్రారంభమై.. ఏప్రిల్ 16వ తేదీ వరకు జరుగుతాయి. పరీక్షల నిర్వహణ కోసం జిల్లా వ్యాప్తంగా 255 సెంటర్లు 1,024 పాఠశాలల నుంచి 53,058 మంది విద్యార్థులు పరీక్షలు రాయబోతున్నారు. ఇందుకు సంబంధించి ఏర్పాట్లు పూర్తి చేశారు. మాస్ కాపీకి పాల్పడకుండా సెట్టింగ్ స్క్వాయిడ్, ప్లయింగ్ స్క్వాడ్ ఏర్పాటు చేశారు.

News March 13, 2026

RR: సరిపడా గ్యాస్ నిల్వలు ఉన్నాయి: కలెక్టర్

image

రాష్ట్రంలో గ్యాస్ కొరత ఏర్పడినట్లు జరుగుతున్న ప్రచారంలో ఎటువంటి వాస్తవం లేదని, రంగారెడ్డి జిల్లాలో LPG గ్యాస్ కొరత లేదని జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి అన్నారు. ఇంతకు ముందు గ్యాస్ బుక్ చేసుకున్న తర్వాత సరఫరా ఉన్నట్లే ప్రస్తుతం కూడా అదే విధంగా గ్యాస్ సరఫరా ఉంటుందని, ఎలాంటి జాప్యం ఉండదన్నారు. జిల్లాలో సరిపడా గ్యాస్ నిల్వలు ఉన్నాయని, గృహ అవసరాలకు వినియోగించే LPG గ్యాస్‌కు ఎలాంటి కొరత లేదన్నారు.

News March 9, 2026

రంగారెడ్డి జిల్లాలో రైతు రిజిస్ట్రేషన్ 88% పూర్తి

image

రంగారెడ్డి జిల్లా పరిధిలో రైతుల రిజిస్ట్రేషన్ ప్రక్రియపై అధికారులు ఫోకస్ చేశారు. జిల్లాలో మొత్తం 1,97,029 మంది రైతులు ఉండగా ఇప్పటివరకు 88% రిజిస్ట్రేషన్ మాత్రమే పూర్తైనట్లుగా అధికారులు తెలిపారు. పీఎం కిసాన్ లాంటి పథకాలు అందాలంటే రైతుల రిజిస్ట్రేషన్ తప్పనిసరి. ఈ నేపథ్యంలో రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఉన్న రైతులందరూ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని అధికారులు సూచించారు.