News November 29, 2024

ఫోన్ ట్యాపింగ్ కేసు.. US సర్కార్‌కు ప్రభాకర్ రావు పిటిషన్

image

ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు తనను రాజకీయ శరణార్థిగా గుర్తించాలని US ప్రభుత్వాన్ని కోరారు. తనకు ఆరోగ్య సమస్యలున్నాయని, TG ప్రభుత్వం తనను ఇబ్బంది పెడుతోందని పిటిషన్‌లో పేర్కొన్నారు. ప్రస్తుతం ఫ్లోరిడాలో కుమారుడి వద్ద ఉంటున్నట్లు తెలిపారు. ఆయనను స్వదేశానికి రప్పించేందుకు, రెడ్ కార్నర్ నోటీసు జారీ చేయించేందుకు TG పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

Similar News

News November 29, 2024

ఫుడ్ పాయిజన్ ఘటనల వెనుక RSP: సురేఖ

image

TG: మంత్రి కొండా సురేఖ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ గురుకుల హాస్టళ్లలో వరుస ఫుడ్ పాయిజన్ ఘటనల వెనుక BRS నేత RS ప్రవీణ్ కుమార్ హస్తం ఉందని తీవ్ర ఆరోపణలు చేశారు. గతంలో ఆయన గురుకులాల కార్యదర్శిగా పనిచేశారని, తన అనుచరులనే సిబ్బందిగా నియమించుకున్నారని తెలిపారు. తమ ప్రభుత్వం వచ్చాక ఫుడ్ పాయిజన్‌తో ఒకే విద్యార్థిని మృతి చెందిందని, దీన్ని రాజకీయం చేయడం సరికాదని మంత్రి వ్యాఖ్యానించారు.

News November 29, 2024

బుమ్రా ఓ కంప్లీట్ ప్యాకేజ్: స్మిత్

image

బౌలింగ్‌లో టీమ్ ఇండియా బౌలర్ జస్ప్రీత్ బుమ్రా ఓ కంప్లీట్ ప్యాకేజీ లాంటి వారని ఆస్ట్రేలియా బ్యాటర్ స్టీవ్ స్మిత్ కొనియాడారు. ‘బుమ్రా రిలీజ్ పాయింట్ మిగతా బౌలర్లందరికంటే బ్యాటర్‌కు అత్యంత దగ్గరగా ఉంటుంది. అడ్జస్ట్ చేసుకునేలోపే బంతి మీదకు వచ్చేస్తుంది. ఇన్‌స్వింగ్, ఔట్‌స్వింగ్, రివర్స్ స్వింగ్, స్లో బాల్, బౌన్సర్, యార్కర్.. ఇలా అన్ని రకాల బంతులూ అతడి అమ్ముల పొదిలో ఉన్నాయి’ అని పేర్కొన్నారు.

News November 29, 2024

GDP SHOCK: 7 త్రైమాసికాల్లోనే అత్యల్పం

image

FY25 Q2లో జీడీపీ వృద్ధిరేటు 5.4%గా నమోదైంది. చివరి త్రైమాసికంలోని 6.7%, గతేడాది ఇదే టైమ్‌లోని 8.1%తో పోలిస్తే బాగా మందగించింది. చివరి 7 త్రైమాసికాల్లో ఇదే అత్యల్పం కావడం గమనార్హం. ఆర్థిక కార్యకలాపాల్లో కీలకమైన GVA 5.6 శాతానికి పెరిగినా FY24 Q2 నాటి 7.7%తో పోలిస్తే తగ్గింది. తయారీ, మైనింగ్ రంగాల్లో వృద్ధిరేటు, పబ్లిక్ స్పెండింగ్, కన్జంప్షన్, కార్పొరేట్ ఎర్నింగ్స్ తగ్గడమే మందగమనానికి కారణాలు.