News November 29, 2024

దిలావర్‌పూర్ ఇథనాల్ కంపెనీపై ప్రభుత్వం ప్రకటన

image

TG: దిలావర్ పూర్ ఇథనాల్ కంపెనీ వివరాలను ప్రభుత్వం బయటపెట్టింది. ఆ కంపెనీకి BRS హయాంలోనే అనుమతులు ఇచ్చి, ప్రజలను మోసం చేశారని ఆరోపించింది. కేంద్ర ప్రభుత్వం ఫ్యూయల్ ఇథనాల్‌కు మాత్రమే అనుమతులు ఇచ్చిందని, వాటిని BRS పట్టించుకోలేదంది. ఇథనాల్, ఎక్స్ ట్రా న్యూట్రల్ ఆల్కహాల్ ఉత్పత్తులకు గత మంత్రివర్గం అనుమతులు ఇచ్చిందని చెప్పింది. 2022 అక్టోబర్ 22న లెటర్ ఆఫ్ ఇండెంట్ జారీ చేసిందని పేర్కొంది.

Similar News

News November 29, 2024

ఉద్యోగులకు శుభవార్త చెప్పిన ప్రభుత్వం

image

TG: రాష్ట్రంలోని ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులకు ఐఆర్ పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా బేసిక్ శాలరీపై 5శాతం పెంచింది. ప్రభుత్వ రంగ సంస్థలు, సహకార సొసైటీలతో పాటు యూనివర్సిటీల్లోని ఉద్యోగులకు ప్రయోజనం అందనుంది.

News November 29, 2024

ఫుడ్ పాయిజన్ ఘటనల వెనుక RSP: సురేఖ

image

TG: మంత్రి కొండా సురేఖ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ గురుకుల హాస్టళ్లలో వరుస ఫుడ్ పాయిజన్ ఘటనల వెనుక BRS నేత RS ప్రవీణ్ కుమార్ హస్తం ఉందని తీవ్ర ఆరోపణలు చేశారు. గతంలో ఆయన గురుకులాల కార్యదర్శిగా పనిచేశారని, తన అనుచరులనే సిబ్బందిగా నియమించుకున్నారని తెలిపారు. తమ ప్రభుత్వం వచ్చాక ఫుడ్ పాయిజన్‌తో ఒకే విద్యార్థిని మృతి చెందిందని, దీన్ని రాజకీయం చేయడం సరికాదని మంత్రి వ్యాఖ్యానించారు.

News November 29, 2024

బుమ్రా ఓ కంప్లీట్ ప్యాకేజ్: స్మిత్

image

బౌలింగ్‌లో టీమ్ ఇండియా బౌలర్ జస్ప్రీత్ బుమ్రా ఓ కంప్లీట్ ప్యాకేజీ లాంటి వారని ఆస్ట్రేలియా బ్యాటర్ స్టీవ్ స్మిత్ కొనియాడారు. ‘బుమ్రా రిలీజ్ పాయింట్ మిగతా బౌలర్లందరికంటే బ్యాటర్‌కు అత్యంత దగ్గరగా ఉంటుంది. అడ్జస్ట్ చేసుకునేలోపే బంతి మీదకు వచ్చేస్తుంది. ఇన్‌స్వింగ్, ఔట్‌స్వింగ్, రివర్స్ స్వింగ్, స్లో బాల్, బౌన్సర్, యార్కర్.. ఇలా అన్ని రకాల బంతులూ అతడి అమ్ముల పొదిలో ఉన్నాయి’ అని పేర్కొన్నారు.