News November 29, 2024

ఆశ్రమ పాఠశాలలో కుళ్లిన గుడ్లు, బంగాళదుంపలు

image

TG: ప్రభుత్వ స్కూళ్లలో ఫుడ్ పాయిజన్ ఘటనల నేపథ్యంలో అధికారులు తనిఖీలు చేపట్టారు. ఆసిఫాబాద్ అడిషనల్ కలెక్టర్ దీపక్ తివారీ ఆశ్రమ పాఠశాలలో తనిఖీలు చేయగా కుళ్లిన గుడ్లు, ఆలుగడ్డలు కనిపించాయి. పప్పునకు బదులు సాంబార్ వండారని, ఉప్పు ప్యాకెట్లపై ISI మార్క్ లేదని గుర్తించారు. విద్యార్థులకు బ్లాంకెట్లు, యూనిఫామ్‌ ఇంకా అందలేదని తెలియడంతో వెంటనే అందించాలని అధికారులను ఆదేశించారు.

Similar News

News November 29, 2024

రేషన్ మాఫియా వెనుక ఎవరున్నా వదిలిపెట్టం: పవన్

image

AP: బియ్యం అక్రమ రవాణాకు డీప్ నెట్‌వర్క్ పనిచేస్తోందని, దీని వెనుక ఎవరున్నా వదిలిపెట్టబోమని Dy.CM పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. కిలో బియ్యం రూ.73 చొప్పున విదేశాలకు అమ్ముతూ రూ.వేల కోట్ల వ్యాపారం చేస్తున్నారని ఆరోపించారు. కాకినాడ పోర్టు వద్ద భద్రతా లోపమే దీనికి కారణమని, సెక్యూరిటీ పెంచేలా కేంద్ర హోంమంత్రికి లేఖ రాస్తానని చెప్పారు. ఏ సంస్థతో విచారణ జరపాలనేదానిపై త్వరలో నిర్ణయం తీసుకుంటామన్నారు.

News November 29, 2024

ఉద్యోగులకు శుభవార్త చెప్పిన ప్రభుత్వం

image

TG: రాష్ట్రంలోని ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులకు ఐఆర్ పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా బేసిక్ శాలరీపై 5శాతం పెంచింది. ప్రభుత్వ రంగ సంస్థలు, సహకార సొసైటీలతో పాటు యూనివర్సిటీల్లోని ఉద్యోగులకు ప్రయోజనం అందనుంది.

News November 29, 2024

ఫుడ్ పాయిజన్ ఘటనల వెనుక RSP: సురేఖ

image

TG: మంత్రి కొండా సురేఖ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ గురుకుల హాస్టళ్లలో వరుస ఫుడ్ పాయిజన్ ఘటనల వెనుక BRS నేత RS ప్రవీణ్ కుమార్ హస్తం ఉందని తీవ్ర ఆరోపణలు చేశారు. గతంలో ఆయన గురుకులాల కార్యదర్శిగా పనిచేశారని, తన అనుచరులనే సిబ్బందిగా నియమించుకున్నారని తెలిపారు. తమ ప్రభుత్వం వచ్చాక ఫుడ్ పాయిజన్‌తో ఒకే విద్యార్థిని మృతి చెందిందని, దీన్ని రాజకీయం చేయడం సరికాదని మంత్రి వ్యాఖ్యానించారు.