News November 29, 2024
AIRTEL, RIL అండ.. ఇన్వెస్టర్లకు రూ.3.5లక్షల కోట్ల లాభం

నిన్న ఘోర పతనం చవిచూసిన స్టాక్ మార్కెట్లు నేడు భారీ లాభాల్లో ట్రేడవుతున్నాయి. సెన్సెక్స్ 780 (79,836), నిఫ్టీ 231 (24,144) పాయింట్ల మేర ఎగిశాయి. హెవీవెయిట్స్ ఎయిర్‌టెల్, సన్ ఫార్మా, సిప్లా, M&M, రిలయన్స్ నుంచి మద్దతు లభించడంతో రోజువారీ గరిష్ఠాల్లో కొనసాగుతున్నాయి. దీంతో ఇన్వెస్టర్లు రూ.3.5లక్షల కోట్ల మేర సంపద పోగేశారు. US ఇన్‌ఫ్లేషన్, వడ్డీరేట్లు తగ్గించకపోవచ్చన్న వార్తలు నిన్న ప్రభావం చూపించాయి.
Similar News
News April 3, 2026
చెపాక్‌లో చెన్నై బోణీ కొడుతుందా?

IPL: తొలి మ్యాచ్‌లో ఘోర పరాజయం ఎదుర్కొన్న CSK ఈరోజు తన రెండో మ్యాచ్ PBKSతో ఆడనుంది. సొంతగడ్డ అయిన చెపాక్ స్టేడియంలో పంజాబ్‌ను ఓడించి బోణీ కొట్టాలని సీఎస్‌కే ఆశిస్తోంది. మరోవైపు GTపై విక్టరీతో ఉత్సాహంగా ఉన్న పంజాబ్ ఈ మ్యాచ్‌లోనూ అదే జోరు కొనసాగించాలని అనుకుంటోంది. ఇరు జట్లు ఇప్పటివరకు 32సార్లు తలపడగా చెరో 16 విజయాలతో సమానంగా ఉన్నాయి. ఈరోజు రాత్రి 7.30కి మ్యాచ్ ప్రారంభమవుతుంది.
News April 3, 2026
ఎలాంటి వారికి దూరంగా ఉండాలి?

వేరుపురుగు చేరి వృక్షంబు జెఱచును
చీడపురుగు చేరి చెట్టు చెఱచు
కుత్సితుండు చేరి గుణవంతు చెఱచురా
విశ్వదాభిరామ! వినుర వేమ!
తాత్పర్యం: ఓ మహా వృక్షాన్ని వేరు పురుగు నాశనం చేయగలదు. ఓ చెట్టును చీడ పురుగు చంపేయగలదు. అలాగే దుర్మార్గుడు కూడా మంచివారిని చెడగొట్టే అవకాశం ఉంది. కాబట్టి అలాంటి వారికి దూరంగా ఉండాలి.
<<-se>>#PADHYAM<<>>
News April 3, 2026
టాప్ సెల్లింగ్ కార్లలో మారుతీ డామినేషన్!

2025-26 ఆర్థిక సంవత్సరం టాప్ 10 సెల్లింగ్ కార్ల జాబితాలో మారుతీ సుజుకీ జోరు ప్రదర్శించింది. ఈ లిస్ట్‌లో ఆరు కార్లు మారుతీ సుజుకీకి చెందినవే ఉన్నాయి. తొలిస్థానంలో 2,29,130 యూనిట్ల సేల్స్‌తో డిజైర్ నిలవగా.. నాలుగో స్థానంలో ఎర్టిగా (1,98,876), ఐదో స్థానంలో సుజుకీ స్విఫ్ట్ (1,85,349), ఏడో స్థానంలో వ్యాగన్-ఆర్ (1,80,134), ఎనిమిదో స్థానంలో బ్రీజా (1,80,104), పదో స్థానంలో బలేనో (1,72,560) నిలిచాయి.


