News November 29, 2024

కొత్త వర్టికల్ సీ బ్రిడ్జ్ రెడీ: అశ్వినీ వైష్ణవ్

image

భారతదేశ మొట్టమొదటి వర్టికల్(నిలువు) లిఫ్ట్ రైల్వే సీ బ్రిడ్జిని పూర్తి చేసినట్లు తెలియజేస్తూ, ఫొటోలను కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ ట్విటర్‌లో షేర్ చేశారు. ఇది తమిళనాడులోని మండపం, రామేశ్వరం ద్వీపం మధ్యలో ఆకాశనీలం జలాల్లో విస్తరించి ఉంది. ఈ అద్భుతమైన అత్యాధునిక సాంకేతికత అబ్బురపరుస్తుందని ఆయన వెల్లడించారు. కాగా, 1914లో నిర్మించిన పాత పంబన్ వంతెన తుప్పుబట్టడంతో 2022లో మూసివేశారు.

Similar News

News April 3, 2026

రాష్ట్రంలో 87 మున్సిపాలిటీలు, 13 కార్పొరేషన్ల పునర్విభజన

image

AP: రాష్ట్రంలో 87 మున్సిపాలిటీలు, 13 మున్సిపల్ కార్పొరేషన్ల పునర్విభజనకు ప్రభుత్వం నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. 2011 జనాభా లెక్కల ఆధారంగా ఈ డీలిమిటేషన్ జరిగింది. ఈ మార్పులతో వార్డుల సంఖ్య విశాఖలో 98 నుంచి 120కి, విజయవాడలో 64 నుంచి 86కు, గుంటూరులో 57 నుంచి 76కు, నెల్లూరులో 54 నుంచి 72కి, కర్నూల్‌లో 52 నుంచి 68కి, తిరుపతిలో 50 నుంచి 66కు, అనంతపురంలో 50 నుంచి 62కు పెరిగాయి.

News April 3, 2026

1,89,819 అక్షరాలతో పదం ఉందని తెలుసా?

image

Pneumonoultramicroscopicsilicovolcanoconiosis (45 అక్షరాలు) అనేది ఇంగ్లిష్‌లో అత్యంత పొడవైన పదం. అగ్నిపర్వత ధూళి వల్ల వచ్చే వ్యాధి ఇది. అయితే టిన్‌టిన్ అనే ప్రొటీన్‌ కెమికల్ నేమ్‌ ఏకంగా 1,89,819 అక్షరాలు ఉంది. Methionylthreonyl.. అంటూ సాగే దీనిని పలకడానికే 2-3hrs పడుతుంది. ఇది 34,350 రకాల ఆమ్లాల గురించి వివరిస్తుంది. దీనిని పదంగా పరిగణించడంపై భిన్నాభిప్రాయాలు ఉండటంతో డిక్షనరీల్లో చోటు దక్కలేదు.

News April 3, 2026

₹167కోట్లు!.. ఇది దేశంలోనే అత్యంత ఖరీదైన పెయింటింగ్

image

రాజా రవివర్మ పెయింటింగ్స్‌లో ఒకటైన ‘యశోద-కృష్ణ’ వేలంలో ఏకంగా ₹167.20కోట్లు పలికింది. సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఎండీ సైరస్ పూనావాలా దీనిని దక్కించుకున్నారు. ఎంఎఫ్ హుసేన్ ‘గ్రామ్ యాత్ర’ పెయింటింగ్ రికార్డ్‌ను (₹118Cr) బ్రేక్ చేసి దేశంలోనే ఖరీదైన చిత్రంగా నిలిచింది. ఈ ఆయిల్ పెయింటింగ్‌ను రవివర్మ 1890ల్లో గీశారు. యశోద ఆవు పాలు పితుకుతుంటే బాలకృష్ణుడు పాత్రతో చేయిచాస్తున్నట్టుగా ఈ చిత్రం ఉంది.