News November 29, 2024
నిజామాబాద్‌లో 9వ తరగతి విద్యార్థి మృతి

నిజామాబాద్‌లోని ఓ ప్రైవేటు పాఠశాలలో చదువుతున్న విద్యార్థి అనుమానాస్పదంగా మృతి చెందాడు. 9వ తరగతి చదువుతున్న జశ్వంత్‌రెడ్డి శుక్రవారం మృతి చెందినట్లు కుటుంబీకులు తెలిపారు. కాగా ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
Similar News
News December 28, 2025
NZB: రోడ్డు ప్రమాదాల నివారణకు విస్తృత స్థాయిలో అవగాహన

రోడ్డు ప్రమాదాల నియంత్రణ కోసం విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి సూచించారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలను విధిగా పాటిస్తే, ప్రమాదాలకు ఆస్కారం ఉండదని అన్నారు. కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్ హాల్‌లో కలెక్టర్ అధ్యక్షతన రోడ్డు భద్రతా కమిటీ సమావేశం జరిగింది. నేషనల్ హైవే అథారిటీ, ఆర్అండ్‌బీ, రవాణా శాఖ, ఆర్టీసీ, పంచాయతీ రాజ్, విద్యుత్ అధికారులు పాల్గొన్నారు.
News December 27, 2025
NZB: 129 మందిపై డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు: ఇన్‌ఛార్జ్ CP

నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో వారం రోజుల్లో 129 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదైనట్లు ఇన్‌ఛార్జ్ పోలీస్ కమిషనర్ రాజేశ్ చంద్ర తెలిపారు. వీరందరినీ కోర్టులో హాజరు పరిచినట్లు చెప్పారు. న్యాయమూర్తి 129 మందికి రూ.8.80 లక్షల జరిమానా వేసినట్లు పేర్కొన్నారు. అలాగే 10 మందికి వారం రోజుల చొప్పున జైలు శిక్ష విధించారని వెల్లడించారు.
News December 26, 2025
NZB: చికిత్స పొందుతూ గుర్తుతెలియని వ్యక్తి మృతి

నిజామాబాద్‌లోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ.. గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందినట్లు 1 టౌన్ SHO రఘుపతి తెలిపారు. ఈనెల 19వ తేదీన ఆస్పత్రి మెయిన్ గేటు పక్కన గుర్తుతెలియని వ్యక్తి అపస్మారక స్థితిలో పడి ఉండగా స్థానికుల సమాచారం మేరకు పోలీసులు చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. సదురు వ్యక్తి చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు. మృతుడి వయస్సు 40-49 సంవత్సరాలు ఉండొచ్చని అంచనా వేశారు.


