News November 29, 2024

చివరి 4 బంతుల్లో 23 రన్స్.. టై.. గెలుపు

image

సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో పంజాబ్, మిజోరం మ్యాచ్‌ ఉత్కంఠగా సాగింది. స్కోర్లు సమం కావడంతో సూపర్ ఓవర్‌కు దారి తీసింది. పంజాబ్ గెలిచేందుకు చివరి 4 బంతుల్లో 24 రన్స్ అవసరమవగా క్రీజులో ఉన్న బ్రార్ (4, 6, wd, 6, 6) ఒక వైడ్ సహా 23 పరుగులు రాబట్టారు. దీంతో మ్యాచ్ టై అయ్యింది. సూపర్ ఓవర్లో రమణ్‌దీప్14(5) కొట్టడంతో పంజాబ్ 8 రన్స్ తేడాతో గెలిచింది.

Similar News

News November 29, 2024

పాపం సమంత

image

టాప్ హీరోయిన్‌గా వెలిగిన సమంత కొన్నాళ్లుగా వ్యక్తిగతంగా కఠిన పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. ప్రేమించి, పెళ్లాడిన నాగచైతన్య నుంచి విడాకులు, ఆ తర్వాత మయోసైటిస్ వ్యాధి ఆమెను మానసికంగా, శారీరకంగా కుంగదీశాయి. ఇప్పుడిప్పుడే వాటి నుంచి కోలుకుంటున్న సామ్‌కి తండ్రి మృతి మరో పెద్ద దెబ్బగా మారింది. కష్ట సమయంలో అండగా నిలిచిన తండ్రిని కోల్పోవడాన్ని సామ్ జీర్ణించుకోలేకపోతున్నారు.

News November 29, 2024

ఇలాంటి జాబ్ మీరూ చేస్తారా?

image

ఉద్యోగాలంటే చాలా మందికి నచ్చదు. ఎందుకంటే ఒకరి కింద తక్కువ జీతానికి పనిచేయాలి కాబట్టి. కానీ, ఏడాదికి రెండు సార్లు మాత్రమే పనిచేస్తూ రూ.లక్షల్లో జీతం పొందే ఉద్యోగం గురించి మీకు తెలుసా? సియోక్స్ ఫాల్స్ టవర్ అండ్ కమ్యూనికేషన్స్‌లో బల్బును ఒక్కసారి మార్చినందుకు ఆ ఉద్యోగికి 20,000 డాలర్లు (రూ.16.5 లక్షలు) చెల్లిస్తారు. 1500 ఫీట్ల ఎత్తులో ఉన్న టవర్‌పైకి ఎక్కి దానిపైన ఉన్న బల్బును మార్చితే చాలు.

News November 29, 2024

20 ఏళ్లుగా ముక్కులో ఉండిపోయిన పాచిక!

image

చైనాకు చెందిన షావోమా(23) అనే వ్యక్తి చాలాకాలంగా తుమ్ములు, ముక్కు దిబ్బడతో బాధపడుతున్నాడు. వైద్యులు ఎండోస్కోపీ చేయగా ముక్కులో 2 సెం.మీ సైజున్న ఓ పాచిక(డైస్)ను గుర్తించారు. తనకు మూడేళ్లున్నప్పుడు అది ముక్కులోకి వెళ్లి ఉండొచ్చని షావోమా తెలిపారు. దాని చుట్టూ కండ కూడా పెరిగిపోవడంతో వైద్యులు జాగ్రత్తగా తొలగించారు. ఇన్నేళ్లుగా ముక్కులో పాచికతో సమస్యల్లేకపోవడం అదృష్టమంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.