News November 29, 2024
YCP హయాంలోనే అక్రమ రవాణా: వనమాడి
AP: YCP హయాంలోనే కాకినాడ పోర్టు నుంచి రేషన్ బియ్యం అక్రమ రవాణా మొదలైందని MLA వనమాడి వెంకటేశ్వరరావు ఆరోపించారు. YCP మాజీ MLA ద్వారంపూడి ప్రమేయంతో ఇదంతా జరుగుతోందన్నారు. పేదలకు అందజేయాల్సిన బియ్యాన్ని పక్కదారి పట్టించి వ్యాపారం చేశారని మండిపడ్డారు. కూటమి అధికారంలోకి వచ్చాక ఉక్కుపాదం మోపుతున్నామని చెప్పారు. రేషన్ అక్రమ రవాణా నేపథ్యంలో <<14741555>>వనమాడిపై<<>> పవన్ ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.
Similar News
News November 29, 2024
పాపం సమంత
టాప్ హీరోయిన్గా వెలిగిన సమంత కొన్నాళ్లుగా వ్యక్తిగతంగా కఠిన పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. ప్రేమించి, పెళ్లాడిన నాగచైతన్య నుంచి విడాకులు, ఆ తర్వాత మయోసైటిస్ వ్యాధి ఆమెను మానసికంగా, శారీరకంగా కుంగదీశాయి. ఇప్పుడిప్పుడే వాటి నుంచి కోలుకుంటున్న సామ్కి తండ్రి మృతి మరో పెద్ద దెబ్బగా మారింది. కష్ట సమయంలో అండగా నిలిచిన తండ్రిని కోల్పోవడాన్ని సామ్ జీర్ణించుకోలేకపోతున్నారు.
News November 29, 2024
ఇలాంటి జాబ్ మీరూ చేస్తారా?
ఉద్యోగాలంటే చాలా మందికి నచ్చదు. ఎందుకంటే ఒకరి కింద తక్కువ జీతానికి పనిచేయాలి కాబట్టి. కానీ, ఏడాదికి రెండు సార్లు మాత్రమే పనిచేస్తూ రూ.లక్షల్లో జీతం పొందే ఉద్యోగం గురించి మీకు తెలుసా? సియోక్స్ ఫాల్స్ టవర్ అండ్ కమ్యూనికేషన్స్లో బల్బును ఒక్కసారి మార్చినందుకు ఆ ఉద్యోగికి 20,000 డాలర్లు (రూ.16.5 లక్షలు) చెల్లిస్తారు. 1500 ఫీట్ల ఎత్తులో ఉన్న టవర్పైకి ఎక్కి దానిపైన ఉన్న బల్బును మార్చితే చాలు.
News November 29, 2024
20 ఏళ్లుగా ముక్కులో ఉండిపోయిన పాచిక!
చైనాకు చెందిన షావోమా(23) అనే వ్యక్తి చాలాకాలంగా తుమ్ములు, ముక్కు దిబ్బడతో బాధపడుతున్నాడు. వైద్యులు ఎండోస్కోపీ చేయగా ముక్కులో 2 సెం.మీ సైజున్న ఓ పాచిక(డైస్)ను గుర్తించారు. తనకు మూడేళ్లున్నప్పుడు అది ముక్కులోకి వెళ్లి ఉండొచ్చని షావోమా తెలిపారు. దాని చుట్టూ కండ కూడా పెరిగిపోవడంతో వైద్యులు జాగ్రత్తగా తొలగించారు. ఇన్నేళ్లుగా ముక్కులో పాచికతో సమస్యల్లేకపోవడం అదృష్టమంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.