News November 29, 2024
GDP SHOCK: 7 త్రైమాసికాల్లోనే అత్యల్పం

FY25 Q2లో జీడీపీ వృద్ధిరేటు 5.4%గా నమోదైంది. చివరి త్రైమాసికంలోని 6.7%, గతేడాది ఇదే టైమ్‌లోని 8.1%తో పోలిస్తే బాగా మందగించింది. చివరి 7 త్రైమాసికాల్లో ఇదే అత్యల్పం కావడం గమనార్హం. ఆర్థిక కార్యకలాపాల్లో కీలకమైన GVA 5.6 శాతానికి పెరిగినా FY24 Q2 నాటి 7.7%తో పోలిస్తే తగ్గింది. తయారీ, మైనింగ్ రంగాల్లో వృద్ధిరేటు, పబ్లిక్ స్పెండింగ్, కన్జంప్షన్, కార్పొరేట్ ఎర్నింగ్స్ తగ్గడమే మందగమనానికి కారణాలు.
Similar News
News November 11, 2025
ఢిల్లీ పేలుడు.. దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎంలు

ఢిల్లీ పేలుడు ఘటనపై తెలుగు రాష్ట్రాల సీఎంలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ఏపీ సీఎం చంద్రబాబు సంతాపం తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు. దేశ రాజధానిలో పేలుడు ఘటన షాక్‌కు గురిచేసిందని తెలంగాణ సీఎం రేవంత్ ట్వీట్ చేశారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అటు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
News November 11, 2025
జడేజా-శాంసన్ స్వాపింగ్ నిజమే!

IPLలో CSK, RR జట్ల మధ్య ట్రేడ్ టాక్స్ నిజమేనని Cricbuzz పేర్కొంది. ఓ ఫ్రాంచైజీ ఆఫీసర్ దీనిని ధ్రువీకరించినట్లు వెల్లడించింది. RR నుంచి శాంసన్ CSKకి, చెన్నై నుంచి రాజస్థాన్‌కు జడేజా, సామ్ కరన్ మారతారని తెలిపింది. ఇప్పటికే ఈ ముగ్గురు ప్లేయర్లు ఇందుకు అంగీకరించి సంతకాలు చేశారని వివరించింది. స్వాప్ ప్రక్రియ పూర్తయ్యేందుకు ఇంకొంత సమయం పడుతుందని, త్వరలో అధికారిక ప్రకటన వస్తుందని పేర్కొంది.
News November 11, 2025
ఢిల్లీలో జరిగిన మేజర్ బాంబు దాడులు

*అక్టోబర్ 9, 2005: దీపావళి తర్వాత రెండు రోజులకు 5.38PM-6.05PM మధ్య వరుస పేలుళ్లు సంభవించాయి. ఈ ఘటనల్లో 67 మంది మరణించారు.
*సెప్టెంబర్ 13, 2008: 6.27PMకు పోలీసులకు మెయిల్ వచ్చింది. దానికి స్పందించే లోపు 9 వరుస పేలుళ్లు జరిగాయి. 5 ప్రాంతాల్లో జరిగిన పేలుళ్లలో 25 మంది చనిపోయారు.
*నేడు జరిగిన పేలుడులో 13 మంది ప్రాణాలు కోల్పోయారు.


