News November 29, 2024

BREAKING: అనంత జేఎన్టీయూ ఫార్మా డీ ఫలితాల విడుదల

image

అనంతపురం జేఎన్టీయూ విశ్వవిద్యాలయం పరిధిలోని ఫార్మా డీ 1వ సంవత్సరం రెగ్యులర్, సప్లిమెంటరీ (R17) పరీక్షల ఫలితాలను విడుదల చేసినట్లు డైరెక్టర్ ఆఫ్ ఎవాల్యూయేషన్ నాగప్రసాద్ నాయుడు, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ శివ కుమార్ తెలిపారు. విద్యార్థులు తమ ఫలితాల కోసం https://jntuaresults.ac.in/ వెబ్ సైట్‌ను సందర్శించాలని సూచించారు.

Similar News

News March 11, 2026

అనంత: ఈ రోజు నుంచి ఉచితం

image

గర్భాశయ కాన్సర్‌ను నిర్మూలించేందుకు తగు చర్యలు చేపట్టినట్లు DMHO దేవి తెలిపారు. అనంతపురంలో ఆమె మాట్లాడుతూ.. గర్భాశయ ముఖ క్యాన్సర్ నిర్మూలనకు బాలికలకు ముందస్తుగా HPV టీకాలు బుధవారం నుంచి వేస్తామన్నారు. జిల్లాలో 14 నుంచి 15 ఏళ్ల మధ్య బాలికలు 16,449 మంది ఉన్నారన్నారు. వారికి సరిపడా డోసులు ముందస్తుగానే జిల్లాకు చేరాయన్నారు. ఒక్కో డోసు ఖరీదు రూ.3,989 కాగా వాటిని ప్రభుత్వం ఉచితంగా ఇస్తోందన్నారు.

News March 10, 2026

బిల్డింగ్స్ అప్రూవల్ విషయంలో అవకతవకలు: ఏసీబీ డీఎస్పీ

image

అనంతపురం మున్సిపల్ కార్యాలయంలోని టౌన్ ప్లానింగ్ విభాగంపై ఫిర్యాదులు వచ్చినట్లు ఏసీబీ డీఎస్పీ ప్రసాద్ రెడ్డి తెలిపారు. పలువురి ఫిర్యాదుల మేరకు తనిఖీలు చేసినట్లు వెల్లడించారు. బిల్డింగ్స్ అప్రూవల్ విషయంలో అవకతవకలు జరిగినట్లు తెలుస్తోందన్నారు. ప్లానింగ్ రూల్స్, డాక్యుమెంట్స్ ప్రకారం బిల్డింగ్స్ కట్టారా, లేదా అని రేపు ఫీల్డ్ విచారణ చేపడతామన్నారు.

News March 10, 2026

గుత్తి కోట ఉత్సవాలు ఘనంగా జరపాలి: జేసీ

image

కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో మంగళవారం గుత్తి కోట ఉత్సవాలపై వివిధ శాఖల అధికారులతో జిల్లా జాయింట్ కలెక్టర్ విష్ణు చరణ్ సమావేశమయ్యారు. ఆయన మాట్లాడుతూ.. ఈనెల 14, 15వ తేదీల్లో జరిగే ఈ గుత్తి కోట ఉత్సవాలను జయప్రదం చేయాలన్నారు. ఉత్సవాలకు వచ్చే ప్రజలకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఏర్పాట్లు చేయాలన్నారు.