News November 29, 2024

SKLM: మాజీ పీఏ గోండు మురళికి రిమాండ్

image

అక్రమ ఆస్తుల కేసులో భాగంగా గురువారం నిర్వహించిన ఏసీబీ దాడుల్లో భాగంగా మాజీ ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణ దాస్ పీఏ గోండు మురళిని అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శుక్రవారం ఆయనను అరెస్టు చేసి విశాఖపట్నం ఏసీబీ కోర్టుకు తరలించారు. కేసు పూర్వాపరాలు గుర్తించిన న్యాయస్థానం ఆయనకు వచ్చే నెల 12వ తేదీ వరకు రిమాండ్ ఇస్తూ తీర్పు ప్రకటించారు. ఈ మేరకు విశాఖ జైలుకు తరలించారు.

Similar News

News December 27, 2024

శ్రీకాకుళం: ‘మన్మోహన్ సింగ్‌‌తో అనుబంధం మరువలేనిది’

image

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణం బాధాకరమని రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. గరువారం రాత్రి మన్మోహన్ సింగ్‌ మరణించడంతో ఆయనతో కలిసి ఉన్న ఫోటోలను అచ్చెన్న సోషల్ మీడియాలో పంచుకున్నారు. దేశంలో నూతన ఆర్థిక సంస్కరణలు చేపట్టిన వ్యక్తిగా మన్మోహన్ సింగ్ చరిత్రలో నిలిచిపోతారన్నారు. ఆయనతో అనుబంధం మరువలేనిదని పేర్కొన్నారు. ఆయన కుటుంబానికి అచ్చెన్న ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

News December 27, 2024

ఎచ్చెర్లలో అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి

image

ఎచ్చెర్లలోని కేశవరెడ్డి స్కూల్లో అసోసియేట్ టీచర్ గనగళ్ల నీరజ(22) బుధవారం అర్ధరాత్రి ఆత్మహత్య చేసుకుంది. ఎచ్చెర్ల ఎస్సై వి.సందీప్ కుమార్ తెలిపిన వివరాల మేరకు గార మండలం కళింగపట్నం పంచాయతీ నగరాలపేటకు చెందిన నీరజ గడిచిన 6 నెలల నుంచి ఇదే స్కూల్ లో పనిచేస్తుంది. నీరజ తన గదిలో ఉన్న ఫ్యాన్ కు చున్నీతో ఉరేసుకుంది. మృతి గల కారణాలు తెలియాల్సి ఉందన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు.

News December 27, 2024

శ్రీకాకుళం: మండల అధికారులతో జేసీ సమీక్షా

image

జిల్లా కలెక్టర్ కార్యాలయంలో గురువారం జాయింట్ కలెక్టర్ మండల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు. పల్లె పండుగ పనులు, రైతుల సమస్యలతో పాటు ప్రజా ఫిర్యాదుల పరిష్కారానికి దృష్టి పెట్టాలని జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ అధికారులను ఆదేశించారు. ఇందులో జిల్లా రెవెన్యూ అధికారి, ఉప కలెక్టర్లు, ఇతర అధికారులు పాల్గొన్నారు.