News November 29, 2024
ఏలూరు జిల్లాను నెంబర్ వన్ స్థానంలో ఉంచాలి: కలెక్టర్

ఏలూరు జిల్లాలోని అన్ని శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి శుక్రవారం అత్యవసర సమావేశం నిర్వహించారు. ఆయా శాఖల ప్రణాళికల లక్ష్య సాధనపై సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలోని వ్యవసాయ, ఉద్యానవన, మత్స్య, పరిశ్రమ, విద్యా, వైద్యం, రోడ్డు, భవనాలు తదితర శాఖలు లక్ష్యంతో పనిచేయాలన్నారు. మనం చేసే కార్యాచరణతో రాష్ట్ర స్థాయిలో జిల్లా మొదటి స్థానంలో ఉండాలన్నారు.
Similar News
News January 12, 2026
ప.గో జిల్లాలో సోమవారం యథావిధిగా పీజీఆర్ఎస్

భీమవరం కలెక్టరేట్, జిల్లాలోని అన్ని ప్రభుత్వ మండల కార్యాలయాల్లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక యథావిధిగా జరుగుతుందని కలెక్టర్ నాగరాణి తెలిపారు. ప్రజల నుంచి అర్జీలు స్వీకరించేందుకు అధికారులు అందుబాటులో ఉంటారని పేర్కొన్నారు. నేరుగా రాలేని వారు 1100 కాల్ సెంటర్ లేదా వెబ్‌సైట్ ద్వారా తమ ఫిర్యాదులను నమోదు చేసుకోవచ్చన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.
News January 11, 2026
ప.గో: పందెపు బరుల ఏర్పాటు.. బౌన్సర్లతో భద్రత!

సంక్రాంతి సమీపిస్తుండటంతో జిల్లాలోని ప్రధాన ప్రాంతాల్లో కోడిపందాల బరుల ఏర్పాటు వేగవంతమైంది. పొలాలు, లేఅవుట్లను చదును చేసి, ప్రేక్షకుల కోసం భారీ గ్యాలరీలు, అతిథుల కోసం ప్రత్యేక విడిది సౌకర్యాలను నిర్మిస్తున్నారు. పందేల వద్ద గొడవలు జరగకుండా ముందస్తుగా ప్రైవేట్ బౌన్సర్లను సైతం నియమిస్తున్నారు. పండుగకు ముందే పందెం రాయుళ్ల హడావుడితో ఊళ్లన్నీ కళకళలాడుతున్నాయి.
News January 11, 2026
భీమవరంలో రౌడీయిజం.. మద్యం మత్తులో దాడి!

భీమవరం రైతు బజార్ సమీపంలోని వైన్ షాప్ వద్ద మద్యం మత్తులో ముగ్గురు వ్యక్తులు ఒకరిపై దాడి చేసి గాయపరిచారు. బాధితుడి ఫిర్యాదుతో వన్ టౌన్ ఎస్సై కిరణ్ కుమార్ కేసు నమోదు చేశారు. ప్రజాశాంతికి భంగం కలిగించినా, శాంతి భద్రతలకు విఘాతం కలిగించినా కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ నాగరాజు హెచ్చరించారు. నిందితులపై చట్టరీత్యా చర్యలు చేపడతామని స్పష్టం చేశారు.


