News November 29, 2024
ఇదెక్కడి మాస్ రా మావా..!

మనకు నచ్చని పని చేసేందుకు వెనకాడుతున్నట్లే.. కప్పలు కూడా మగవాటితో సంభోగం ఇష్టం లేకుంటే అవి విచిత్రంగా ప్రవర్తిస్తుంటాయి. కొన్ని కప్పలు మగవాటి దృష్టిని మళ్లించేందుకు చనిపోయినట్లు నటిస్తాయని కెమెరాలో రికార్డయింది. కలయిక ఇష్టం లేని సమయంలో దాన్నుంచి తప్పించుకోవడానికి కప్పలు వంటివి ఇలా ఆశ్చర్యకరమైన రీతిలో ప్రవర్తించడాన్ని గుర్తించారు. తెలివిగా కదలకుండా, కళ్లు మూసుకొని, నిర్జీవ స్థితిలో ఉంటున్నాయి.
Similar News
News December 26, 2025
వంటింటి చిట్కాలు మీ కోసం

* కొబ్బరి చట్నీ చేసేటపుడు అందులో నీళ్ళకు బదులు పాలు పోస్తే మరింత రుచిగా ఉంటుంది.
*బెండకాయముక్కలను ఉప్పుతో కడిగితే కూర జిగురు రాదు.
* గిన్నెలకు గ్రీజు మరకలు అంటితే సబ్బు నీళ్ళలో వెనిగర్ కలిపి రుద్దితే పోతాయి.
* టమాటా సూప్ కు మంచి రంగు రావాలంటే అందులో బీట్ రూట్ ముక్క వేయాలి.
* వంటకాలు తక్కువ నూనెను పీల్చుకోవాలంటే మూకుడులో కాస్త వెనిగర్ వేయండి.
News December 26, 2025
బీసీ స్కాలర్‌షిప్‌ల కోసం రూ.90.50 కోట్లు మంజూరు

AP: ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్ విద్యాసంస్థల్లో చదువుతున్న బీసీ విద్యార్థుల కోసం రూ.90.50 కోట్ల స్కాలర్‌షిప్ నిధులు మంజూరు చేసినట్లు మంత్రి సవిత తెలిపారు. 2025-26 విద్యాసంవత్సరానికి గానూ పోస్ట్ మెట్రిక్ రెండో విడతకు రూ.69.40Cr, ప్రీ మెట్రిక్ రెండో విడతకు రూ.21.10Cr స్కాలర్‌షిప్ ఫండ్స్ కేటాయించినట్లు చెప్పారు. ఆర్థిక ఇబ్బందులతో బీసీ విద్యార్థులు విద్యకు దూరం కాకూడదన్నదే తమ లక్ష్యమన్నారు.
News December 26, 2025
భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్‌లో ఉద్యోగాలకు నోటిఫికేషన్

భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్(BEML) 27 ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల వారు JAN 10 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి CA/CMA/MBA, PG, BE, PGDM ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. Asst. మేనేజర్‌కు గరిష్ఠ వయసు 30 ఏళ్లు కాగా, మేనేజర్‌కు 34, Dy.GMకు 45, GMకు 48, CGMకు 51ఏళ్లు. వెబ్‌సైట్: bemlindia.in


