News November 29, 2024
ఐక్యంగా లేకపోతే ఎలా?.. పార్టీ నేతలకు ఖర్గే క్లాస్

హరియాణా, మహారాష్ట్ర ఎన్నికల్లో ఓటమి ఓ సందేశంగా భావించి దిద్దుబాటు చర్యలు చేపట్టాలని పార్టీ నేతలకు AICC అధ్యక్షుడు ఖర్గే క్లాస్ తీసుకున్నారు. CWC సమావేశంలో ఆయన మాట్లాడుతూ అంతర్గతంగా ఐక్యత లోపించడం పెద్ద సమస్య అని అన్నారు. నేతల పరస్పర విరుద్ధ వ్యాఖ్యలు పార్టీకి నష్టం చేస్తున్నాయని ఘాటుగా స్పందించారు. ఐక్యంగా లేకపోతే ప్రత్యర్థిని ఎలా ఓడిస్తామని ప్రశ్నించినట్టు తెలిసింది.
Similar News
News December 29, 2025
నేటి నుంచి అసెంబ్లీ.. ‘జల’ జగడమేనా?

TG: నేటి నుంచి అసెంబ్లీ శీతాకాల సమావేశాలు మొదలుకానున్నాయి. <<18695816>>KCR<<>> రాకపైనే సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇటీవల ప్రెస్‌మీట్‌లో ప్రభుత్వంపై సాగునీటి విషయంలో ఉద్యమిస్తామని ప్రకటించిన ఆయన సభలో ఉంటే చర్చ హీట్ ఎక్కనుంది. కాగా ఇవాళ సభలో మొదట డిప్యూటీ స్పీకర్‌ను ఎన్నుకోనున్నారు. తెలంగాణ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్, మున్సిపాలిటీస్ చట్ట సవరణ బిల్లు, GHMC చట్ట సవరణ బిల్లులను సీఎం సభలో ప్రవేశపెట్టనున్నారు.
News December 29, 2025
సూపర్ నేపియర్ గడ్డితో పశువులకు కలిగే లాభమేంటి?

పచ్చి గడ్డిలో విటమిన్-A అధికంగా ఉంటుంది. సూపర్ నేపియర్ గడ్డిలో 10-12 శాతం మాంసకృత్తులు, 50-55% జీర్ణమయ్యే పదార్థాలు, 28-30 శాతం పీచుపదార్థం ఉంటుంది. ఈ గడ్డిలో చక్కెర పదార్థాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి, పశువులు ఇష్టంగా తింటాయి. దీనివల్ల పాడిపశువుల్లో ఎదుగుదల, సంతానోత్పత్తితో పాటు పాల దిగుబడి పెరుగుతుంది. సూపర్ నేపియర్ గడ్డిని తప్పనిసరిగా చాఫ్ కట్టర్‌తో చిన్న ముక్కలుగా కత్తిరించి పశువులకు వేయాలి.
News December 29, 2025
శివాలయంలో చండీ ప్రదక్షిణే ఎందుకు చేయాలి?

శివాలయంలో సోమసూత్రం వద్ద శివగణాధిపతి చండేశ్వరుడు ధ్యానంలో ఉంటాడు. సోమసూత్రం దాటితే ఆయన ధ్యానానికి భంగం కలుగుతుందని నమ్మకం. అలాగే శివ నిర్మాల్యం (పూలు, ప్రసాదం)పై పూర్తి అధికారం ఆయనదే. అందుకే గౌరవార్థం సోమసూత్రం దాటకుండా వెనక్కి మళ్లుతారు.


