News November 29, 2024

వారి ర‌క్ష‌ణ బంగ్లాదేశ్ ప్ర‌భుత్వ బాధ్య‌త‌: జైశంకర్

image

బంగ్లాలోని హిందువులు, మైనారిటీల ర‌క్ష‌ణ అక్క‌డి ప్ర‌భుత్వ బాధ్య‌త‌ని విదేశాంగ మంత్రి జైశంక‌ర్ అన్నారు. వీరిపై జ‌రుగుతున్న దాడుల్ని భార‌త ప్ర‌భుత్వం తీవ్రంగా ప‌రిగ‌ణిస్తోంద‌న్నారు. ఇదే విష‌యాన్ని అక్క‌డి ప్ర‌భుత్వం ముందు వ్య‌క్తం చేసిన‌ట్టు తెలిపారు. బంగ్లాలో ప‌రిస్థితుల‌ను హైక‌మిష‌న్ స‌మీక్షిస్తోంద‌ని పేర్కొన్నారు. చిన్మయ్ కృష్ణదాస్ అరెస్టుతో అక్కడి పరిస్థితులు ఉద్రిక్తంగా మారిన విషయం తెలిసిందే.

Similar News

News November 30, 2024

టాలెంట్ ఉంటే సరిపోదా?

image

IPL వేలం క్రికెట్ ప్రేమికుల్లో అనేక సందేహాలను రేకెత్తించింది. ప్రపంచ దేశాల్లో పరుగుల వరద పారించి ఎన్నో రికార్డులు బద్దలు కొట్టిన వార్నర్, విలియమ్సన్‌, చిన్న దేశం బంగ్లా నుంచి వచ్చినా అగ్రశ్రేణి దేశాలను వణికించిన ముస్తఫిజుర్ రెహ్మాన్‌ ఈ IPL వేలంలో అమ్ముడుపోలేదు. అయితే అంతటి వరల్డ్ క్లాస్ ప్లేయర్లను కొనని ఫ్రాంచైజీలు సచిన్ తనయుడు అర్జున్ టెండూల్కర్‌ను కొనడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మీరేమంటారు?

News November 30, 2024

జడ్జికే లంచం ఇవ్వబోయాడు.. అరెస్టయ్యాడు!

image

గుజరాత్‌లో ఏకంగా న్యాయమూర్తికే లంచం ఇచ్చేందుకు యత్నించాడో వ్యక్తి. పంచమహల్ జిల్లా కోర్టులోకి ప్రవేశించిన బాపూ సోలంకీ అనే వ్యక్తి సరాసరి న్యాయమూర్తి ముందు ఓ సీల్డ్ కవర్ పెట్టాడు. కోర్టు సిబ్బంది దాన్ని ఓపెన్ చేయగా రూ.35వేలు కనిపించాయి. ఇదేంటని ప్రశ్నిస్తే ఎవరో ఇవ్వమన్నారని సమాధానమిచ్చాడు. జడ్జి ఆదేశాల మేరకు ACB అధికారులు అతడ్ని అరెస్ట్ చేశారు. కేసు నమోదు చేసి విచారిస్తున్నామని వారు తెలిపారు.

News November 30, 2024

మెడికల్ కాలేజీల ఆస్తులు జప్తు చేసిన ఈడీ

image

తెలంగాణలో మెడికల్ కాలేజీలకు చెందిన రూ.9.71 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ సీజ్ చేసింది. ఇందులో మల్లారెడ్డి కాలేజీ రూ.2.89 కోట్లు, MNR కాలేజీ రూ.2.01 కోట్లు, చల్మెడ ఆనందరావు కాలేజీ రూ.3.33 కోట్ల ఆస్తులున్నాయి. పీజీ మెడికల్ సీట్లను బ్లాక్ చేసి మేనేజ్‌మెంట్ కోటాలో అమ్ముుకున్నట్లు ఆయా కాలేజీలపై ఆరోపణలొచ్చాయి. దీంతో గతేడాది జూన్‌లో రాష్ట్రంలోని 16 చోట్ల ఈడీ సోదాలు నిర్వహించి, కేసులు నమోదు చేసింది.