News November 29, 2024
రైతులకు ఏడాదిలో ₹54,280 కోట్ల ప్రయోజనం: పొంగులేటి
TG: కాంగ్రెస్ ప్రభుత్వం అన్నదాతల సంక్షేమానికి అగ్రపీఠం వేస్తోందని మంత్రి పొంగులేటి అన్నారు. ఏడాది కాలంలోనే అన్నదాతలకు ₹54,280కోట్ల ప్రయోజనం చేకూరిందని వివరించారు. 22లక్షలకుపైగా రైతులకు ₹17,870Cr రుణమాఫీ, పంటల బీమాకు ₹1,300Cr, ధాన్యం కొనుగోళ్లకు ₹5,040Cr, ఉచిత్ విద్యుత్‌కు ₹10,444Cr, రైతు భరోసాకు ₹7,625Cr, బీమా ప్రీమియానికి ₹1,455Cr, గత యాసంగి ధాన్యం కొనుగోళ్లకు ₹10,547Cr వెచ్చించినట్లు తెలిపారు.
Similar News
News November 30, 2024
మెడికల్ కాలేజీల ఆస్తులు జప్తు చేసిన ఈడీ
తెలంగాణలో మెడికల్ కాలేజీలకు చెందిన రూ.9.71 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ సీజ్ చేసింది. ఇందులో మల్లారెడ్డి కాలేజీ రూ.2.89 కోట్లు, MNR కాలేజీ రూ.2.01 కోట్లు, చల్మెడ ఆనందరావు కాలేజీ రూ.3.33 కోట్ల ఆస్తులున్నాయి. పీజీ మెడికల్ సీట్లను బ్లాక్ చేసి మేనేజ్‌మెంట్ కోటాలో అమ్ముుకున్నట్లు ఆయా కాలేజీలపై ఆరోపణలొచ్చాయి. దీంతో గతేడాది జూన్‌లో రాష్ట్రంలోని 16 చోట్ల ఈడీ సోదాలు నిర్వహించి, కేసులు నమోదు చేసింది.
News November 30, 2024
మ్యాచ్ ఫిక్సింగ్.. ముగ్గురు SA క్రికెటర్లు అరెస్ట్
మ్యాచ్-ఫిక్సింగ్ ఆరోపణలతో ముగ్గురు సౌతాఫ్రికా క్రికెటర్లు అరెస్టయ్యారు. 2016లో డొమెస్టిక్ T20 రామ్ స్లామ్ ఛాలెంజ్ టోర్నీలో వీరు ఫిక్సింగ్‌కు పాల్పడ్డట్లు ఆరోపణలున్నాయి. దీంతో లెనాక్స్ త్సోత్సోబే (40), థమ్‌సంకా త్సోలేకిలే (44), ఎథీ మభలతి (43)లను పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపర్చారు.
News November 30, 2024
టెన్త్ పరీక్షలపై ప్రభుత్వం కీలక నిర్ణయం
పదో తరగతి పరీక్షలపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇంటర్నల్ పరీక్షల ఎత్తివేత నిర్ణయాన్ని వాయిదా వేసింది. వచ్చే ఏడాది నుంచి దీన్ని అమలు చేయనున్నట్లు ప్రకటించింది. ఈ ఏడాది 80శాతం మార్కులతో పరీక్షలు, 20 శాతం ఇంటర్నల్ మార్కులుంటాయని పేర్కొంది. గ్రేడింగ్ విధానంతోనే ఫలితాలు వెల్లడిస్తామని తెలిపింది. కాగా ఈసారి నుంచి ఇంటర్నల్ ఎత్తివేస్తామని ప్రభుత్వం నిన్న <<14735937>>ప్రకటించిన<<>> విషయం తెలిసిందే.