News November 29, 2024
కర్నూలు: ‘సెమిస్టర్ పరీక్షలను పక్కగా నిర్వహించాలి’

పరీక్షలను సరిగ్గా నిర్వహించాలని ఇన్‌ఛార్జి వైస్ ఛాన్స్‌లర్ ఎన్టీకే నాయక్ అన్నారు. శుక్రవారం రాయలసీమ వర్సిటీ పరిధిలో డిగ్రీ 3వ, 5వ సెమిస్టర్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. యూనివర్సిటీ పరిధిలోని ఉమ్మడి కర్నూలు జిల్లాలో 61 పరీక్ష కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించారు. కర్నూలులో పరీక్ష కేంద్రాలను ఆయన పరిశీలించారు. 6,531 మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా, 5,848 మంది హాజరయ్యారు. 683 గైర్హాజరయ్యారు.
Similar News
News March 28, 2026
సెయింట్ జోసెఫ్‌లో ‘జీరో వేస్ట్’ అవగాహన సదస్సు

కర్నూలు నగరంలోని సెయింట్ జోసెఫ్ కళాశాలలో శనివారం ‘జీరో వేస్ట్ ఇన్‌స్టిట్యూషన్స్’ అంశంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి, జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. పొడి, తడి, పారిశుధ్య వ్యర్థాల విభజన విధానంపై వారు విద్యార్థులకు వివరించారు. స్వర్ణాంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర లక్ష్యంగా పారిశుధ్యంపై అవగాహన కల్పించారు.
News March 27, 2026
కందుకూరు ఘటనపై కర్నూలు ఎంపీ దిగ్భ్రాంతి

కోసిగి మండలం కందుకూరు సమీపంలో తుంగభద్ర నదిలో స్నానానికి వెళ్లిన కర్ణాటక వాసుల నలుగురు మృతి చెందిన ఘటనపై ఎంపీ బస్తిపాటి నాగరాజు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సమాచారాన్ని అధికారుల నుంచి తెలుసుకున్న ఎంపీ.. మృతదేహాలను త్వరగా వారి స్వస్థలాలకు తరలించేలా తక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
News March 27, 2026
కర్నూలు: ముగ్గురిపై జిల్లా బహిష్కరణ

జిల్లాలో శాంతి భద్రతలకు భంగం కలిగించే కార్యకలాపాలకు పాల్పడుతున్న ముగ్గురిపై జిల్లా బహిష్కరణ ఉత్తర్వులు జారీ చేసినట్లు కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి, ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. కర్నూలు(M) పి.రుద్రవరం గ్రామానికి చెందిన వెంకటేశ్వర్లు, పుండుకుర మధు, మధుసూదన్ తీవ్ర నేరాల్లో నిందితులుగా ఉండటంతో ఈ చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు. జిల్లాలో ఇప్పటివరకు జిల్లా బహిష్కరణకు గురైన వారి సంఖ్య 8కి చేరింది.


